
ఫలితాలు వచ్చి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీడీపీకి దూరమయ్యారు. అసలు టిడిపి కండువా వేసుకుని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా సండ్ర ఇష్టపడలేదు. ఆ తర్వాత ఆయన కారుక్కేశారు. ఇక రెండేళ్ల పాటు మౌనంగా ఉన్నా అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ఆ తర్వాత టిడిపిని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు.
ఇక సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారే టైంలోనే ఆయన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే తెలంగాణలో మంత్రి వర్గంలో మార్పుల వార్తల నేపథ్యంలో మరోసారి మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. సత్తుపల్లి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఆయన మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎస్సీ సామాజికవర్గం నేతల్లో సండ్రే సీనియర్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆయన అన్నారు. మరి కేసీఆర్ ఫైనల్ గా సండ్రను బుగ్గ కారు ఎక్కిస్తారో లేదో ? చూడాలి.