ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చేంద‌ కు రెడీ అవుతున్నారు. మూడు రాజధానులు బిల్లు శాసనమండలి లో ఆమోదం పొందక పోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ శాసన మండలిని రద్దు చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపారు.

జగన్ మండలిని రద్దు చేసిన వెంటనే అప్పుడు మండలి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ - పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఆగమేఘాల మీద మంత్రివర్గం నుంచి తప్పించి వారిని రాజ్యసభకు పంపేశారు. అయితే ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. మండలిలో వైసిపి బలం పెరిగింది. దీంతో జగన్ ఇప్పుడు మండలి తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా అసెంబ్లీలో మండలి ర‌ద్దు బిల్లును ఉపసంహరించుకున్నట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పింది. దీంతో త్వరలో జరిగే క్యాబినెట్ ప్రక్షాళనలో మరోసారి మండలి నుంచి ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గం నేత తోట త్రిమూర్తులు - శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళింగ సామాజిక వర్గం నేత దువ్వాడ శ్రీనివాస్ - అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జ్ , మైనార్టీ నేత మ‌హ్మ‌ద్ ఇక్బాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ ముగ్గురినే జగన్ మండలి నుంచి క్యాబినెట్లోకి తీసుకుంటారని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో తోట త్రిమూర్తులు ఓసిల‌ లో బలమైన కాపు వర్గానికి చెందిన వారు. దువ్వాడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నా కాళింగ వర్గం నేత. ఇక ఇక్బాల్ మైనార్టీ వర్గానికి చెందిన నేత. ఏదేమైనా జగన్ మండలి నుంచి ఈ ముగ్గురిని కేబినెట్లోకి తీసుకుంటే మరో సంచలనం చేసినట్టే అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: