చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ బాగా బలంగా ఉన్న విషయం తెలిసిందే. అసలు బాబు సొంత జిల్లాలో వైసీపీ ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి. జిల్లాలో రెడ్డి సామాజికవర్గం హవా కాస్త ఎక్కువగా ఉంటుంది..అలాగే ఎస్సీ ఓటింగా కూడా ఎక్కువ ఉంది...గత ఎన్నికల్లో బీసీలు కూడా వైసీపీ వైపు వెళ్లారు. దీంతో జిల్లాలో వైసీపీ హవా నడిచింది. అయితే జిల్లాలో వైసీపీ బలం తగ్గించడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు.

కానీ చంద్రబాబుకు పెద్ద పట్టు దొరకడం లేదు. వైసీపీలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేల బాగా స్ట్రాంగ్‌గా ఉండటంతో జిల్లాలో వైసీపీ హవా తగ్గించలేకపోతున్నారు. జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలు రెడ్డి వర్గం వారే. 14 సీట్లు ఉన్న చిత్తూరులో వైసీపీ 13 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 13 మందిలో 7 మంది రెడ్డి ఎమ్మెల్యేలే. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరిలో రోజా రెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డిలు ఉన్నారు.

ఇక ఈ రెడ్డి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. జిల్లాలో ఉన్న ఇతర వర్గాల ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది గానీ...ఈ రెడ్డి ఎమ్మెల్యేలపై పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో వీరిని ఓడించడం కూడా మళ్ళీ కష్టమే అని చెప్పాలి. పెద్దిరెడ్డి, ద్వారకానాథ్, చెవిరెడ్డి, భూమన, మధుసూదన్‌లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. చింతల, రోజాలకు కాస్త నెగిటివ్ కనిపిస్తోంది.

కాకపోతే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు. కానీ మిగిలిన రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడం జరిగే పనిలా కనిపించడం లేదు. పైగా ఆ రెడ్డి ఎమ్మెల్యేలకు అపోజిట్‌లో ఉన్న టీడీపీ నేతలు కాస్త వీక్‌గా ఉన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో వారు పెద్దగా పుంజుకోలేదు. మొత్తానికైతే చిత్తూరులో రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడం టీడీపీకి కష్టమే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: