తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల కేటాయింపుల‌లో  సినియారిటీని ప్రాతిప‌దిక‌గా తీసుకోవ‌డాన్ని హై కోర్టు త‌ప్పు ప‌ట్టిన‌ది. సీనియారిటీని ప్రాతిప‌దిక‌న టీచ‌ర్ల నుంచి అభ్యంత‌రాలు తీసుకొని ప్ర‌భుత్వానికి పంపించాల‌ని డీఈఓల‌ను ఆదేశించిన‌ది. ఆ అభ్యంరాలను ఒక‌సారి పునఃప‌రిశీలించాల‌ని ఈనెల 30 తేదీన ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని అనుకుంది. ఈ మేర‌కు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అభినంద్ కుమార్ షావ‌లీ ఇటీవ‌లే ఉత్త‌ర్వుల‌ను కూడా జారీ చేసారు.

 అయితే సీనియారిటీకి విరుద్ధంగా తనను జోగుళాంబ గద్వాల జిల్లాకు కేటాయించారంటూ రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం బూర్గుల జీపీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జయప్రదతో పాటు మరికొందరు పిటిష‌న్లు దాఖ‌లు చేసారు. ఆ పిటీష‌న్ల‌ను  న్యాయమూర్తి నిన్న విచారించారు. ముఖ్యంగా సీనియారిటీ ఆధారంగా పిటిషనర్‌ను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాల్సి ఉందని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

కేటాయింపులు సీనియారిటీ ఆధారంగా ఉంటాయని.. మార్గదర్శకాల్లో పేర్కొన్నా అందుకు విరుద్ధంగా చేసారని కోర్టులో పేర్కొన్నారు.  తనను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాలని ఈ నెల 22న డీఈఓకు పిటిషనర్‌ వినతిపత్రం సమర్పించారని వెల్ల‌డించారు. ఆ అభ్యంతరాలను పరిశీలించి సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది నివేదిక ఇచ్చారు. సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు ఉండేలా చూడాలని ప్ర‌భుత్వాన్ని   ఆదేశిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.

మ‌రోవైపు ఉపాధ్యాయుల కొర‌త ఉన్న త‌రుణంలో ఒకేసారి తొమ్మిది మందిని బ‌దిలి చేస్తే.. తాము ఎలా చ‌దువుకోవాల‌ని మంచిర్యాల జిల్లా జ‌న్నారం మండ‌లం క్రిష్టాపురం గ్రామంలో ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థులు రొడ్డెక్కారు. అయితే బదిలీ అయిన స్థానాల్లో కేవ‌లం ఆరుగురు మంది మాత్ర‌మే రానున్నారు. మ‌రోకొ ముగ్గురి కొర‌త ఉన్న‌ది.. మూడు నెల‌ల్లోనే ప‌రీక్షలు ఉన్నాయ‌ని.. మేము ఎలా చ‌దువుకోవాల‌ని విద్యార్థులు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలోనే ఈ స‌మ‌స్య‌ల‌పై క‌లెక్ట‌ర్‌, విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. కేవ‌లం రెండు, మూడు జిల్లాల‌లోనే కాదు.. ఈ స‌మ‌స్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల‌లో ఉపాధ్యాయుల బ‌దిలీ స‌మ‌స్య ఉన్న‌ద‌ని తెలుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: