ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారం లోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే. అందుకే విపక్షాలు అన్నీ వైసీపీ ని మరియు ఏపీ ప్రభుత్వాన్ని మానిఫెస్టోలో చెప్పినవన్నీ చేశారా? ఒకవేళ చేసి ఉంటే అందులో లోపాలను ఎత్తి చూపిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రజలను మచ్చిక చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీ టీమ్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక ప్రకారం రోజుకి ఒక నాయకుడితో మీడియా సమావేశాన్ని పెట్టిస్తున్నారు. ఈ రోజు మాజీ మంత్రి నెల్లూరు కి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతి ఎన్టీఆర్ భావం నుండి జగన్ ను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈయన మాట్లాడుతూ మద్యం గురించి ముఖ్యంగా హైలైట్ చేశారు. జగన్ కొత్త రకపు మద్యాన్ని తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. కేవలం విచ్చల విడిగా డబ్బును సంపాదించడం కోసమే ఎటువంటి క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకు అందుబాటు లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉండగానే వీలైనంత సంపాదించడం కోసం ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలను పొట్టపెట్టుకునే ఈ మద్యాన్ని అమ్మడం మూలంగా సంవత్సరానికి 5 వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు అంటూ లెక్కలతో సహా బయట పెట్టారు .

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యం కంపెనీలు అన్నీ కూడా ఎవరివో బయట వారివి కాదని, వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు నడిపిస్తున్నవే అని ఝలక్ ఇచ్చారు. జంగారెడ్డి గూడెంలో అన్యాయంగా నాటు సారా తాగి చనిపోయిన వారి కుటుంబాలను చూసి అయినా ఈ నాసిరకం మద్యాన్ని ఆపి వేయాలని తనదైన శైలిలో జగన్ పై విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: