ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పరంగా ప్రజలు అంతా సంతోషం గానే ఉన్నారు. 2019 లో ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతోంది వైసీపీ ప్రభుత్వం. అయితే పరిపాలనా అనుభవం లేక పోవడం వలన కొన్ని పొరపాట్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటినీ సర్దుకుని ముందుకు తీసుకెళ్తున్నాడు సీఎం జగన్. కాగా ఏపీ మంత్రిగా చేసిన ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి గుండె పోటుతో హఠాత్తుగా మరణించడం తో ఆ స్థానం ఖాళీ అయింది. దీనితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సైతం రెండు రోజుల క్రితమే పార్టీ అయింది.

ఆత్మకూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు అయిన విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్నాడు.
టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉండడంతో, బీజేపీ తరపు నుండి భరత్ కుమార్  పోటీ చేయనున్నాడు. అయితే ఈ ఎన్నికలో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాజీ దివంగత మంత్రి మరియు ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డికి మరియు వీరి కుటుంబానికి ఆత్మకూరులో మంచి పేరు ఉండడంతో పాటుగా.. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. పైగా గౌతమ్ రెడ్డి మచ్చలేని నాయకుడిగా తన నియోజకవర్గ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నాడు.


ఇప్పుడు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నది తన సోదరుడే కావడంతో ఆ సానుభూతి మరియు కుటుంబంపై ఉన్న మంచి పేరు కారణంగా ప్రజలు తమను ఆశీర్వదిస్తారని నమ్మకంతో మేకపాటి ఫ్యామిలీ మరియు వైసీపీ ఉంది.  మరి నామినేషన్ రోజు సర్వేపల్లి ఎమ్మెల్యే మరియు నెల్లూరు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డ్డి చెప్పిన విధంగా వైసీపీ లక్ష మెజారిటి సాధిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: