సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యే వరకు ఆయన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా సాగింది.ములాయం సింగ్ యాదవ్‌కు రాజకీయంగా ఎలాంటి నేపథ్యమూ లేదు. కానీ, స్తీ పోటీల్లోని కిటుకుల కారణంగానే ఆయన రాజకీయ పోటీల్లో కూడా విజయం సాధించాడని ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను విశ్లేషించే రాజకీయ నిపుణులు అంటుంటారు.ములాయం సింగ్‌లోని టాలెంట్‌ను గుర్తించింది ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు నాథూ సింగ్. 1967 ఎన్నికల్లో జస్వంత్ నగర్ అసెంబ్లీ టికెట్ ములాయంకు ఇచ్చారు ఆయన.అప్పటికి ములాయం సింగ్ యాదవ్ వయసు 28 ఏళ్లు మాత్రమే. అప్పటికి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యంత తక్కువ వయసులో ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా ములాయం సింగ్ యాదవ్ రికార్డు నెలకొల్పారు. ఎమ్మెల్యే అయిన తర్వాతే ఆయన తన ఎమ్.ఏ. చదువును పూర్తి చేశారు.


1977లో ఉత్తర ప్రదేశ్‌లో రామ్ నరేశ్ యాదవ్‌ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ములాయం సింగ్ సహకార శాఖ మంత్రి అయ్యారు. అప్పుడు ఆయన వయసు 38 ఏళ్లు మాత్రమే.చౌధరీ చరణ్ సింగ్ తన రాజకీయ వారసుడిగా ములాయం సింగ్ యాదవ్‌ను, తన చట్టబద్ధమైన వారసుడిగా సొంత కొడుకు అజిత్ సింగ్‌ను పిలిచేవారు.చరణ్ సింగ్‌కు తీవ్ర అనారోగ్యం చేసినప్పుడు అజిత్ సింగ్ అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చారు. అప్పుడు అజిత్ సింగ్‌ను పార్టీ అధ్యక్షుడిని చేయాలంటూ ఆయన మద్దతుదారులు చరణ్ సింగ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.దీంతో ములాయం సింగ్, అజిత్ సింగ్ మధ్య పోటీ మొదలైంది. కానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం ములాయం సింగ్‌కే దక్కింది.1989 డిసెంబర్ 5వ తేదీన లఖ్‌నవూలోని కేడీ సింగ్ స్టేడియంలో ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ''ఒక పేదవాడి కొడుకును ముఖ్యంత్రి చేయాలన్న లోహియా ఒకప్పటి కల ఇప్పుడు నిజం అయ్యింది'' అని ఆ సందర్భంగా ములాయం సింగ్ గద్గద స్వరంతో అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: