తెలంగాణలో వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారీటతో గెలిచింది. పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ నాలుగు లక్షల పైగా  మెజారీతో రికార్డు నెలకొల్పారు.  గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 3,92,594 మెజార్టీ రాగా ఇప్పుడు, పాత మెజార్టీ అధిగమించి టీఆర్ఎస్ కొత్త మెజార్టీ సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్‌కు 6,15,403 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకు 1, 56,310 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి దేవయ్యకు 1,30,178 ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పసునూరి దయాకర్ అంచెలంచెలుగా ఎంపీ అయ్యారు.

ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.  ఇప్పుడు టీఆర్ఎస్ మంచి జోష్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో  మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్లో స్పందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు విశ్వాసం ఉంచారు అనడానికి వరంగల్ లోక్‌సభలో విజయమే నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ఫలితాలతో తల ఎక్కడ పెట్టుకుందని ప్రశ్నించారు. ఇప్పుడైనా ఆ మీడియా ప్రజలకు ఏవైనా మంచి పనులు చేయాలని కోరుతున్నానని చెప్పారు.

జీహెచ్ఎంసీ

 

ఈ విజయాన్ని అందించిన వరంగల్ ప్రజలను కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రెఫరెండం అని చెప్పి మరీ ఈ ఎన్నికల్లో తలపడ్డామన్నారు. మా పనితీరుకు మీ తీర్పు నిదర్శనమన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుంటే... తాము మాత్రం గెలుస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే మా పనితీరుకు నిదర్శనమని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భవిష్యత్ లో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్  సత్తా చూపిస్తుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: