రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు తిరుగలేని పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. మహిళలపై అత్యాచారాలు. దాడులను అరికట్టేందుకుగాను చట్టాలు కఠినంగా చేస్తుండగా మరోవైపు యధావిధిగానే అత్యాచారాలు, దాడులు వెలుగుచూస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఇలాగే కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అందరిలో కలిగే అందోళనలు.
భర్తతో కలిసి భారతయాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్ కు చెందిన యువతిని ఎనమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన మన దేశంలోని మద్యప్రదేశ్ లో దాతీమ సమీపంలో జరుగగా ఈ సంఘటన జరిగి 48గంటలు గడువక ముందే ఆంద్రప్రదేశలో మరో మూడు దారుణమైన సంఘటనలు వెలుగుచూశాయి. ఇదంతా చూస్తుంటే అసలు సమాజంలో శాంతిభధ్రలున్నాయా లేదా అనే భావన కలుగుతుంది. పార్లమెంటులో అత్యాచార సంఘటనలపై అట్టుడికి పోయిన మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు.
రంగారెడ్డి జిల్లా పరిగి మండలంలోని కొల్లాపూర్ గ్రామంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విధులను నిర్వహిస్తున్న యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగుచూసింది. ఇందులో ఒకరు ఖాకీబట్టలు వేసుకొని శాంతి భధ్రతలు కాపాడుతామని పోలీసుశాఖలోకి వచ్చినటువంటి హోంగార్డు కూడా ఉన్నాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తుంది. కాగా మరో సంఘటన సికింద్రాబాద్ లో జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై ఒక ఉద్యోగి అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగుచూసింది. సిఆర్పీ ఎఫ్ క్వార్టర్స్ ప్రక్కనే ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. మరో సంఘటన యాసీడ్ దాడి నెల్లూరు జిల్లాలో సీతారాంపూర్ ప్రాంతంలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి చేశారు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మద్యన కొట్టామిట్టాడుతుంది. కాగా నిందితులను పోలీసులు ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ఇలా ఒక్కరోజే మన రాష్ట్రంలో వెలుగుచూసిన సంఘటనలు ఈ విధంగా ఉంటే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందనే విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: