ప్రజాసంపద, ప్రకృతినుంచి ప్రసాదమయ్యే బొగ్గుగనులు, పెట్రోలియం, ఖనిజసంపద, తాగునీరు తరలిపోతుంది. ప్రపంచీకరణ విధానాల వల్ల ఈపరిస్థితి ఏర్పడింది. అమెరికా సామ్రాజ్యవాదులకు లక్షల ఎకరాలు భూములను కట్టబెడుతున్నారు. పాలకవర్గాల చర్యలతో వాతావరణమంత పూర్తిగా కలుషితమైంది.
అడవులు ఎడారులుగా మారాయి. కృష్ణా, గోదావరి బెసిన్ నుంచి వెలువడుతున్న గ్యాస్ మన రాష్ట్ర అవసరాలు తీర్చకుండానే పొరుగురాష్ట్రాలకు విక్రయించబడుతుంది. దేశంలో ప్రైవేటీకరణ వేగం పుంజుకుంది. విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని సామ్రాజ్యవాద కంపెనీలు పరం చేశారు. సామర్లకోట పవర్ ప్లాంట్ ను భారతీయ కంపెనీకి ఇచ్చిన అమెరికా కంపెనీ నిర్మించింది. దీంతో అమెరికా పెత్తనం దేశంపై ఏ విధంగా ఉంతో స్పష్టమవుతుంది. పవర్ ప్లాంట్ జనరేటర్ అమెరికాలో తయారై వచ్చింది. ఫలితంగా అమెరికాలో 20వేల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని అమెరికా అధ్యక్షుడు ఒబామానే వెల్లడించారు. ప్రపంచబ్యాంకు రూపొందించిన ప్రణాళికను అమలు జరిపి ప్రజల పై విచ్చలవిడిగా దోచుకుంటున్నారు.
ఏ పెట్టుబడిధారులైనా పరిశ్రమ పెడితే దాని కోసం కెటాయించిన భూమి, నిర్మించిన భవనాలు, యంత్రాలు, సిబ్బంది జీతభత్యాలు, ముడి సరుకులు ఖర్చులు నిర్వహణ వ్యయం అప్పుల పై వడ్డీలు కలిపి అయున మొత్తాన్ని పెట్టుబడిగా తీసుకుంటున్నారు. ధరలు స్వయంగా వారే నిర్వహించుకుంటున్నారు. మన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నా మన రాష్ట్రానికి విదేశాల బొగ్గు ఎందుకు కొనుక్కోవలసి వచ్చింది. ఇంధన్ సర్ చార్జీ సర్దుబాటు పేరుతో 8 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజల పై పన్నుల్ని మోపింది. అందుకే ఎక్కడి వనరులు అక్కడే వినియోగించుకుంటే అభివృద్దితో పాటు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: