దేశంలో మహిళలపై లైంగిక నేరాలను నిరోధించేందుకు ఎన్ని పటిష్టమైన చట్టాలుతీసుకువచ్చినప్పటికిని మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు వెలుగువస్తున్నాయి. కాగా ఓడిషా, బీహార్ రాష్ట్రాల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు వెలుగులోకి రాగా ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. బీహార్ లోని సహర్సా జిల్లాలోని మార్కెట్ యార్డు నుంచి తిరిగి వస్తున్నఒక నర్స్ పై ముగ్గురు కామందులు అత్యాచారానికి పాల్పడ్డారని అక్కడి పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా ఒడిషాలో రెండు అత్యాచార కేసులు వెలుగుచూశాయి. అంగుల్ జిల్లాలోని బలిఖమానా గ్రామానికి చెందిన 21 ఏళ్ల మహిళ రాత్రి యాత్రను చూసేందుకు తన బందువులతో కల్సి నీరుత్రాగడానికి సమీపంలోని హోటల్ కు వెళ్లగా ముగ్గుర యువకులు ఆమెపై అత్యాచారం జరుపడంతోపాటు ఆమెను రాళ్లతో కొట్టి అక్కడినుండి పారిపోయారు. కాగా ఈకేసులో ఒకరిని అరెస్టు చేశామని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. దీంతో పాటు కాశీపల్ గ్రామంలో 17ఏళ్ల బాలనేరస్థుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అదే విధంగా పంజాబ్ లోని పటియాలాలో గల నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్ ట్యూట్ లో వంట మనిషిగా పనిచేసే రామవర్మ 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: