మండే ఎండలను కూడ లెక్క చేయకుండా జగన్ కృష్ణాజిల్లాలో చేస్తున్న పాదయాత్రలో ఎవరూ ఊహించని విధంగా నందమూరి ఫ్యామిలీని ఆశ్చర్యపరుస్తూ తాను అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లాను నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తాను అంటూ చేసిన ప్రకటన వెనుక చాల  ప్రకటన వెనుక చాల పెద్దరాజకీయ వ్యూహం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
JAGAN PADAYATRA IN KRISHNA DISTRICT LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
జగన్ గత కొద్ది రోజులుగా కృష్ణాజిల్లాలో చేస్తున్న పాదయాత్రకు స్పందించి ఈ జిల్లాలోని అనేకమంది కమ్మ సామాజిక వర్గ నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ జగన్ వేస్తున్న వ్యూహాలకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇప్పటికే ఆందోళనలో ఉన్నాయి. దీనికితోడు జగన్ గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జగన్ పర్యటిస్తూ అనేకమంది కమ్మ సమాజిక వర్గ నేతలను ఆకర్షించడం తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లాలో కొత్త తలపోట్లను తెచ్చి పెడుతోంది. 
JAGAN PADAYATRA IN KRISHNA DISTRICT LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు కృష్ణాజిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్లేక్సీల చుట్టూ పసుపు రంగు జెండాలు కట్టడం తెలుగుదేశం నాయకులను మరింత కలవర పెడుతోంది. కొన్ని ఫ్లేక్సీలలో అయితే వైఎస్ జగన్ బొమ్మలతో పాటు ఎన్టీఆర్ ఫొటోలను కూడా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు తెలుగుదేశం నాయకులకు అసహనం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో జగన్ ఈరోజు నిమ్మకూరులో ఎన్టీఆర్ కుటుంబ బంధువులు  జగన్ ను కలవడమే కాకుండా నీరు చెట్టు కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని జగన్‌కు వారు వివరించడం రాజకీయ వర్గాలలో సంచలన వార్తగా మారింది. 
JAGAN PADAYATRA IN KRISHNA DISTRICT LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికేఅనేక సార్లు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అని విజ్ఞప్తలు చేయడంతోపాటు కొత్త రాజధాని నిర్మిస్తున్న ప్రాంతానికి అమరావతి బదులు ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని ఎందరో విజ్ఞప్తులు చేసినా తెలుగుదేశ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈవిషయంలో బాలకృష్ణ కూడా పరిస్తుతులతో రాజీపదిపోయాడు అన్న విశ్లేషణలు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో నందమూరి కుటుంబంతో ఏవిధంగాను సంబంధంలేని జగన్ నోటి వెంట ఎన్టీఆర్ జిల్లా ప్రస్తావన రావడం బాలకృష్ణకు షాక్ మాత్రమే కాకుండా ఒక విధంగా బాలయ్యకు చెక్ పెట్టే ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో ఊహించని షాక్ లు ఎదుర్కుంటున్న బాలయ్యకు ఈ ఎన్టీఆర్ జిల్లా వ్యవహారం మరో కొత్త తలపోటు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: