అవును..ఇప్పుడు ఓ వార్త జగన్ అభిమానులను కలవరపెడుతోంది. అదే సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌లో నిర్లక్ష్యానికి సంబంధించిన వార్త. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తరచూ ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ లో పర్యటనలు చేయాల్సి వస్తుంది. కానీ.. ఆయన హెలికాప్టర్ పర్యటనల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారట..


ఇప్పటికే జగన్ భద్రతపై హెచ్చరికలు వెళ్లాయట..? ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత కు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసిందట. అంతే కాదు. సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో అధికారులు అలసత్వంగా వ్యవహరించినందుకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైందట.


సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. శనివారం కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కూడా జగన్ హెలికాప్టర్ కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారట. వాస్తవానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి వివరాలను డిగ్రీలు, మినిట్స్,సెకన్స్ ఫార్మెట్ లో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు కేవలం డిగ్రీల్లో మాత్రమే ఇచ్చారని సీఎంవో అధికారులు చెబుతున్నారు.


ఎందుకిలా జరుగుతోంది.. అసలే ఓసారి హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాతావరణం బాగా లేక.. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు..ఆ చేదు జ్ఞాపకాలను మరచి.. జగన్ లో వైఎస్ ను చూసుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఈ హెలికాప్టర్ ప్రయాణంలో నిర్లక్ష్యం వార్తలు విని భయపడుతున్నారు. జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: