ఎవరు ఏం చెప్పినా సరే ఫిబ్రవరి 14 వచ్చింది అంటే ప్రేమికులకు పండుగ అన్నట్టే. ఈరోజు ప్రపోజల్స్ ఎన్ని జరుగుతాయో.. కొన్నాళ్లుగా తమలో ఉన్న ప్రేమని తమ ప్రేయసికి వ్యక్తపరిచే ఓ సదావకాశం. అంతేకాదు ఆల్రెడీ ప్రేమలో ఉన్న వారికి ఓ ఫెస్టివల్ డే. ఎక్కడో పరాయి దేశంలో పుట్టిన ఈ వాలెంటైన్స్ డేని వాళ్ల కన్నా ఎక్కువ మన వాళ్లు పండుగలా జరుపుకుంటారు. అయితే అదంతా పనిపాట లేని వారు చేసుకునేదని కొందరు అనుకుంటారు లేండి.. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమలో ఉన్న వారు.. ప్రేమిస్తున్న వారు సంతోషంగా ఉంటారు కాని భగ్న ప్రేమికులు.. తమ ప్రేయసి తమని విడిచి వెళ్లిన వారు ఏం చేస్తారు..? ఏముంది వారిని గుర్తు చేసుకుని బాధపడతారు.

 

అయితే అలా బాధ పడ్డ తర్వాత వారి మీద కోపం వస్తుంది. దూరమైన వారిని దగ్గరకు తీసుకొచ్చే మార్గం ఉండదు. అందుకే తమని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లిన వారి మీద కోపం వస్తుంది. అయితే ఇలా తమని వదిలి వెళ్లి వేరే పెళ్లి చేసుకున్న వారి ప్రేయసి మీద కసిని ఓ జూలో తీర్చుకునేలా ఏర్పాటు చేశారు. అదేంటి ప్రేయసి మీద ఉన్న కసిని జూలో ఎలా తీర్చుకుంటారనేగా మీ డౌట్. మాజీ లవర్ మీద కోపం పోగొట్టుకోవడం కోసం టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో ఓ కొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.

 

వాలెంటైన్స్ డే నాడు ప్రేమించిన అమ్మాయిని దూరమైన భగ్న ప్రేమికులు ఎవరైనా సరే బొద్దింకలు, ఎలుకలకు తమ లవర్ పేర్లని పెట్టి వాటిని తీసుకెళ్లి జంతువులకు ఆహారం వేయొచ్చు. ఇదేదో శాడిజంలా అనిపిస్తున్నా ఆ జూ నిర్వాహకులు ఎప్పుడైతే ఇలా పెట్టారో ఆ జూకి ఆదాయం కూడా పెరిగిందట. బొద్దింకకు 5 డాలర్లు, ఎలుకలు 25 డాలర్లు వసూళు చేస్తున్నారట జూ యాజమాన్యం. అలా తమ మాజీ లవర్ మీద ఉన్న కోపాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. మరి మీరు కూడా ఇలాంటిది ఏదైనా ట్రై చేసే ఆలోచన ఉంటే చేసేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: