2012లో ఒక విద్యార్థినిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హేయమైన చర్య చేసి ఆమె మరణానికి కారణమైన ఆరుగురి నిందితుల లోని నలుగురికి తాజాగా ఒక డెత్ వారంట్ జారీ అయింది. ఆ డెత్ వారెంట్ ప్రకారం నిందితులకు మార్చి మూడవ తేదీన ఉరి శిక్ష అమలు కానుంది. అయితే నిందితులు తమని ఉరి తీస్తారన్న భయంతో నానా రకాల చావు తెలివి తేటలను ఉపయోగించుకుంటున్నారు. ఇందులోని భాగంగానే సోమవారం నాడు వినయ్ శర్మ తీహార్ జైలులోని తను ఉంటున్న సెల్ గోడలకు తల బాదుకుని తీవ్ర కలకలం రేపుతున్నాడు.



జైలు అధికారులు చెప్పిన ప్రకారం వినయ్ శర్మ తల బాదుకునేటప్పుడు వార్డెన్స్ అప్రమత్తమై వెంటనే అతడిని కాపాడారు. తరువాత బాగా గాయాలైన వినయ్ ని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది వినయ్ కు ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. అలాంటి డిశ్చార్జి అయిన వినయ్ శర్మ మళ్ళీ తనని తాను గాయపరచుకున్నాడు. జైలు సెల్ యొక్క ఇనుపకడ్డీల తలుపులు మూసుకునేప్పుడు వాటి మధ్య తన తలని పెట్టాడు. దీంతో అతనికి దిమ్మతిరిగిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు. ఇదేమి గోల,రా! బాబు అనుకుంటూ అతడిని మళ్ళీ ఆస్పత్రికి తరలించగా... వైద్యులు పరిశీలించి అతనికి మతిస్థిమితం తప్పిందని చెప్పారు. కానీ జైలు అధికారులు మాత్రం వినయ్ శర్మ మానసిక పరిస్థితి మంచిగానే ఉందని చెబుతున్నారు. అనుమానం వచ్చిన అధికారులు మానసిక వైద్య నిపుణులను పిలిపించి సైకోమెట్రీ టెస్ట్ ని దోషికి నిర్వహించారు. ఆ పరీక్షలో వినయ్ శర్మ పర్ఫెక్ట్ గా స్పందించాడని అధికారులు చెబుతున్నారు.




ఏదేమైనా డెత్ వారంట్లు జారీ అయిన ప్రతిసారీ నిందితులు తమని తాము గాయపరచుకునేందుకు సవాలక్ష ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జైలు అధికారులకు వీరి కాపాడటం పెద్ద తలనొప్పిగా మారింది. తీహార్ జైలులో ప్రస్తుతం 24గంటల పాటు CC కెమెరాలు అమర్చి మరీ దోషులను పర్యవేక్షిస్తున్నారు. జైలు కూడు తినడానికి కూడా వాళ్ళు ఇష్ట పడడం లేదట. ఉరిశిక్ష అమలు కావడానికి ఇంకా దాదాపు రెండు వారాల సమయం ఉండడంతో మళ్లీ ఏ అడ్డంకులు వచ్చి పడతాయోనని అందరూ అనుకుంటున్నారు. బూజుపట్టిన మన న్యాయవ్యవస్థ వలన ఈసారైనా వారికి ఉరిశిక్ష పడుతుందో లేదో చుడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: