అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప‌ర్య‌ట‌న గుజ‌రాత్ నుంచే ప్రారంభం కానుంది. ట్రంప్‌కు భారీ ఎత్తున స్వాగ‌తం ఏర్పాట్లు రెడీ అయ్యాయి. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఘ‌న‌స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. ఇక మోడీ ముందుగా అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని మ‌రీ ఏర్పాట్లు చేస్తున్నారు.



అహ్మ‌దాబాద్ నుంచి మొతేరా స్టేడియం వ‌ర‌కు సుమారు 22 కిలోమీట‌ర్ల వ‌ర‌కు భారీ ఎత్తున ర్యాలీ కొన‌సాగ‌నుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇక అహ్మ‌దాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ట్రంప్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మొతేరా స్టేడియం చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి.  ఇది అహ్మ‌దాబాద్‌లోని మొతేరా ప్రాంతంలో ఉండ‌డంతో దీనికి మొతేరా స్టేడియం అని పేరు వ‌చ్చింది. అయితే వాస్త‌వంగా ఈ స్టేడియం పేరు భార‌త తొలి హోం మంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియం. గుజ‌రాత్ ఉక్కు మ‌నిషి అయిన ప‌టేల్ పేరుతోనే ఆ స్టేడియంకు ఈ పేరు పెట్టారు.



ఈ స్టేడియంకు క్రికెట్ ప‌రంగా చాలా ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. 1982లో దీనిని తొలిసారిగా నిర్మించారు. అప్పుడు దీని కెపాసిటీ 47 వేలు ఇప్పుడు... మ‌ళ్లీ మార్చి క‌ట్టాక దీని కెపాసిటీ 1.14 ల‌క్ష‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో అతి పెద్ద స్టేడియంగా ఉన్న మెల్‌బోర్న్ స్టేడియం రికార్డులు ప‌టేల్ స్టేడియం బ‌ద్ద‌లు కొట్టింది. ఇది మెల్‌బోర్న్ స్టేడియం 1.10 ల‌క్ష‌ల సిట్టింగ్ కెపాసిటీని బ‌ద్ద‌లు కొట్టింది.



మోడీ ప్ర‌ధాని కావ‌డానికి ముందే దీనిని పున‌ర్ నిర్మించాల‌ని ప్ర‌తిపాదించారు. మొత్తం రు.700 కోట్ల‌తో దీనిని తిరిగి నిర్మించారు. 2015 నుంచి 2019 వ‌ర‌కు మోడీ, అమిత్ షా గుజ‌రాత్ క్రికెట్ సంఘంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. భార‌త మాజీ స్టార్ క్రికెట‌ర్లు క‌పిల్‌దేవ్‌, సునీల్ గ‌వాస్క‌ర్ ల‌కు ఈ స్టేడియం ఎన్నో మ‌ధురానుభూతులు మిగిల్చింది. క‌పిల్ ఒకే ఇన్సింగ్స్‌లో 9 వికెట్లు ఈ స్టేడియంలోనే తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: