ఈ మధ్య కాలంలో మహిళలపై రోజురోజుకు లైంగిక  వేధింపులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు  తీసుకొచ్చినప్పటికీ  మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. మొన్నటి వరకు బయటి వారి నుంచి రక్షణ ఉండేది కాదు... బయట ఉండే  కామాంధుల బారి నుంచి రక్షించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేసిన కామపు కోరల్లో చిక్కుకుంటున్నారు మహిళలు . ఇక  రోజురోజుకు సొంత వారి నుంచి కూడా మహిళలకు రక్షణ కరువవుతోంది. నానాటికీ రక్త సంబంధాలు బంధుత్వాలు నాశనం అయిపోతున్నాయి. వావివరుసలు మరచి పోతున్న కామాంధులు... అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది విజయనగరం జిల్లాలో. కామంతో కళ్లు మూసుకుపోయి సొంత కోడలు పైనే  మామ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... పాత బొబ్బిలి ప్రసాద్ నగర్ కాలనీ లో ఉండే ఓ యువకుడికి కొంతకాలం క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం దంపతులు ఇద్దరూ వేరు కాపురం ఉంటున్నారు. ఇక ఆ యువకుడికి చినాన్న  వరస అయ్యే వ్యక్తి రోజు ఆ యువకుడు ఇంటికి వస్తూ సరదాగా మాట్లాడి వెళుతూ వుండేవాడు. వచ్చింది తండ్రి లాంటి మామయ్య కదా అని ఆ యువకుడి భార్య కూడా అతని తో చనువు గా మాట్లాడుతుండేది. కానీ ఆ కామాంధుడి మనసులో ఉన్న ఆలోచనలు మాత్రం అర్ధం చేసుకోలేకపోయింది. 

 

 

 ఓ రోజు  భర్త పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లో ఉంది యువతీ. విషయం తెలుసుకున్న కామాందుడు  ఇంట్లోకి ప్రవేశించి... వావి వరసలు మరిచి ఆ యువతిని తాళ్లతో కట్టి కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి... దారుణంగా అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఆ తర్వాత కాసేపటికి తేరుకున్న బాధితురాలు ఎదుటి వారిని పిలిచి తనపై జరిగిన అఘాయిత్యాన్ని తెలిపి...  ఇక స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది యువతి.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.అయితే తన మామ వరుసయ్యే  వ్యక్తి గతంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని..ఎవరికైనా చెబితే  చంపేస్తాను బెదిరించటం తో  ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అంటూ  బాధితురాలు తెలిపింది. కాగా  పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

 

 

అయితే సమాజం రోజు రోజుకు ఎంత దారుణంగా మారుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. తండ్రి తరువాత తండ్రిలా  ఉండాల్సిన మామ కామంతో కళ్లు మూసుకుపోయి ఎంత నీచానికి ఒడిగట్టాడు. రోజురోజుకీ వావి వరసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోతున్న సమాజం తీరు  ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బంధాలకు అనుబంధాలకు నిలయమైన భారతదేశంలో... ఇలాంటి దుస్థితి ఎన్నడూ చూడనిది.

మరింత సమాచారం తెలుసుకోండి: