ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిడిపి వైసిపి పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని టిడిపి భావిస్తుంటే.... ఇప్పటి వరకు తాము ప్రవేశపెట్టిన పథకాలు తమను గెలిపిస్తాయి వైసీపీ ప్రభుత్వం ధీమాతో ఉంది.  ఈ నేపథ్యంలో అటు జనసేన బిజెపి కూటమి కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది . దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. 

 

 

 

 అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై పలు విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ డబ్బు మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలంటూ చంద్రబాబు తెలిపారు... ఫోటోలు వీడియోలు తీసి  పంపాలంటూ టిడిపి నేతలకు సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ భవన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామంటూ తెలిపిన అధినేత చంద్రబాబు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని దీనిని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు మద్యం పెంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు వైసిపి పార్టీ ప్రయత్నిస్తే వెంటనే ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు. 

 

 

 అయితే యువ నాయకత్వం ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు సరైన అవకాశం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక నేతలుగా యువతను ప్రోత్సహించాలని.. టిడిపి నేతలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. స్థానిక సంస్థల ఎన్నికల పై టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటి నుంచే టిడిపి నేతలు అందరూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని... టిడిపి నేతలందరూ ఈసారి విజయఢంకా మోగించాలి  అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: