దేవుడు తాను భువీలో ఉండలేనని ఈ భువిపై తనకు బదులు గా అమ్మను సృష్టించాడని అంటారు.  అమ్మగా లాలించనూ గలదు.. అపర కాళిగా మారి దుష్టులను అంతమొందించనూ గలదు. చిన్న కణంతో మనిషినే సృష్టించి.. ప్రాణం పోసి భూమిపైకి తేగల దేవతామూర్తి. ఓ సోదరిగా.. భార్యగా, తల్లిగా అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూనే నారీ శక్తి అనుకుంటే ప్రపంచంలో ఏమైనా చేయగలమని సత్తాను చాటుతూనే ఉంది.   నేడు ప్రపంచ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా ఎంతో మంది మహిళలు సాధించిన ఘనత వెలుగు లోకి తీసుకు వస్తున్నారు.  తాజాగా మనోధైర్యంతో యుద్ధ వాతావరణంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఓ ధీర వనిత గురించి  తెలిస్తే మీరు కూడా హ్యాట్సాఫ్ చెబుతారు. 

 

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం.. దేశంలోనే నక్సలైట్లకు పెట్టని కోట అనే విషయం అందిరకీ తెలిసిందే.  లీసులు, నక్సలైట్ల మధ్య హోరాహోరీ కాల్పుల ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి ప్రాంతంలో 8 నెలల గర్భంతో ఓ మహిళ ఏకే 47 చేతబట్టి.. అడవుల్లో కూబింగ్ చేయడం.. అంటే ప్రాణాలు ఫణంగా పెట్టడం.. ప్రాణాలు పోయినా సంతోషంగా త్యాగం చేయడం లేక్క.  దంతెవాడలోని గిరిజనులు తమ కులదైవంగా పూజించే దంతేశ్వరి మాత పేరుతో ఈ ఫోర్స్‌ను ప్రారంభించింది. దంతేశ్వరి మాతను పార్వతి దేవి అంశంగా 52 శక్తి పీఠాల్లో ఒకటిగా చెబుతారు.  ఆయుధ బలగాలలో అడుగుపెట్టాలని సునైనా పటేల్‌ చిరకాల లక్ష్యం.

 

ఆమె ఎంతో కఠోర శిక్షణకు నిలబడి.. దంతేశ్వరి ఫైటర్స్‌లో స్థానం సాధించింది. ఫోర్స్‌లో చేరే నాటికే ఆమె రెండు నెలల గర్భవతి.  అయినా ట్రైనింగ్ తీసుకుంది.. దేశం కోసం ప్రజా రక్షణ చేయాలని ఆమె ధృడ సంకల్పంతో ముందుకు సాగింది. డాక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుని డ్యూటీలో కొనసాగేలా ఏర్పాటు చేశారు.  దంతేశ్వరి ఫైటర్స్‌ టీమ్ మొత్తాన్ని సునైనా ఓ ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్. ఆమె గిరిజన ప్రాంతాల్లో మహిళలను కూడా మోటివేట్ చేసేదని అన్నారు.  తనకు ప్రెగ్నెన్సీ అని తెలిసినా..పట్టుదలగా డ్యూటీలో ముందుకు సాగిందని తెలిపారు. నిజంగా మహిళలూ మీకు సలాం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: