సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధి కోసం మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే. మొత్తం రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ వారు గత 80 రోజులు పైనుంచి ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. అయితే అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందని, అమరావతి అభివృద్ధికు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్న ఆ ప్రాంతం వారు ఉద్యమం ఆపడంలేదు.

 

అయితే ఈ క్రమంలోనే ఊహించని విధంగా అమరావతిలో జగన్‌కు కొన్ని కలిసొచ్చే అంశాలు నెలకొన్నాయి. స్థానిక ఎన్నికలకు సిద్ధమైన జగన్...అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరపకుండా ఆపేసిన విషయం తెలిసిందే. జగన్ ఓటమికు భయపడి ఆపేశారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న, అభివృద్ధి కోసమే ఎన్నికలు ఆపామని వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి అమరావతి అభివృద్ధిలో భాగంగానే ఎన్నికలు ఆపారు.

 

నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాలను కలిపి అమరావతి మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటును చేయడంలో భాగంగా ఎన్నికలు నిలిపేశారు. అటు యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపారు. దీనిపై రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేశారు. దీంతో ఆ గ్రామాల ఎన్నికలు కూడా ఆగిపోయాయి.

 

అయితే అమరావతిని కార్పొరేషన్ చేసి అభివృద్ధి చేయడం కోసమే ఎన్నికలు ఆపారనే విషయాన్ని రైతులు నిదానంగా అర్ధం చేసుకోవడం ఖాయమని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇదే అంశం భవిష్యత్‌లో తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ భూములు లేని నిరుపేదలకు రాజధాని గ్రామాలలో భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ అదే రాజధాని ప్రాంతంలో కొందరు సీఎం జగన్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు.

 

ఇక ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో పట్టున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరడం కలిసొచ్చే పరిణామం. డొక్కాకు అమరావతిలో కీలకంగా ఉన్న తాడికొండ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. మొత్తానికైతే అమరావతిలో జరుగుతున్న కొన్ని పరిణామాలు జగన్‌కు అనుకూలంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: