ఎప్పుడు కరోనా కరోనా అంటూ విసిగిపోతున్నారా.. మనసుకు కాస్త ఊరట కలిగంచే వార్తలే రావడం లేదనుకుంటున్నారా.. అయితే మీలాంటి వారికోసమే ఈ న్యూస్.. ఇన్నాళ్లూ రాజకీయాలు, రేపులు, హత్యల గురించి మాట్లాడుకున్నాం.. ఆ తర్వాత కరోనా గురించి దాదాపుగా రెండునెలలుగా విని విని విసుగు వస్తుందేమో.. అందుకే ప్రకృతి సృష్టిలో ఉన్న ఒక వింత పక్షి గురించి తెలుసుకుందా.. ఇది పాత వార్తే అయినా ఈ సమయంలో మరో సారి గుర్తు చేసుకోవడంలో తప్పులేదని మీ ముందుకు తెస్తున్నా..

 

 

ఇక సాధరణంగా ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రకృతిపరంగా లభించే ప్రతీది ఒక అద్భుతంగా తోస్తుంది.. నిజంగా మనసుతో ఆరాధించాలే కానీ ఈ ప్రకృతివల్ల కలిగే హాయి చాల గొప్పదిగా అనిపిస్తుంది.. ప్రకృతి భయపెట్టగలదు.. జో కొట్టగలదు.. అందుకే ఈ సృష్టిలో జీవించే ప్రతి ప్రాణికి ప్రకృతితో విడదీయలేని అనుబంధం ఉంటుంది.. అది చూసే కళ్లను బట్టి కనిపిస్తుంది.. ఇకపోతే  ఇదొక చిన్న పక్షి.. అందంగా ఉంటుంది. తీయగా పాడుతుంది... రంగులతో ఆకట్టుకుంటుంది... అలాగని పట్టుకుందామనుకుంటే.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే..

 

 

ఇక ఈ పిట్ట చెట్టు కొమ్మ మీద ఉంటే చూసి ఆనందించడమే మంచిది. ఎందుకంటే అది విషపూరితం.. నలుపు, నారింజ అను రెండు రంగుల్లో ముద్దుగా ఉన్న దీన్ని తాకితే చాలు, దాని ఈకలు, శరీరంపై ఉండే విషం ఎక్కేస్తుంది. తోటి జీవులకే కాదు, మనుషులకి కూడా అది ప్రమాదమే. దీని విషము సోకినాక కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒళ్లంతా తిమ్మిరి పట్టడం, తల తిరగడం వంటి మొదలగు లక్షణాలు కనిపిస్తాయి ఒక్కోసారి పక్షవాతం రావడం, మరణించడం కూడా జరిగే ప్రమాదముంది. అందుకే ఇది ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో విషపూరితమైనదిగా పేరు తెచ్చుకుంది. తోక నుంచి ముక్కు దాకా ఎక్కడ తాకినా అంతా విషమయమే.

 

 

ఇకపోతే ఈ పక్షులు ఎక్కువగా న్యూగినియా అడవుల్లో కనిపిస్తాయి. కాగా ఈ పక్షి పేరు పితోహి. దీని చర్మం, ఈకలపై ఉండే ఒకరకమైన విషరసాయనం ఈ పక్షికి రక్షణ కవచంగా పని చేస్తుంది.. ఇక్కడ విచిత్రమేమిటంటే ఈ విషం దాని శరీరంలో ఉత్పత్తి కాదు. ఇవి ఎక్కువగా కోరెసైన్‌ అనే కీటకాలను తినడం వల్ల.. వాటిలో ఉండే విషాన్నే దీని చర్మం, ఈకలు స్రవిస్తూ ఉంటాయి. ఈ ఆహారం ద్వారా ఈ పక్షిలో విషం ఏర్పడుతుంది..

 

 

ఇక జీవులన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన జీవిగా 'పాయిజన్‌ డాట్‌ కప్ప'ని పేర్కొంటారు. దాని శరీరంపై ఉండే విషరసాయనమే దీనిపై కూడా ఉంటుందని కనుగొన్నారు... చూసారా మనుషుల్లాగే అందమైన పక్షుల్లో కూడా ఇలా విషపు పక్షులు ఉంటాయి.. సో అందాన్ని చూసి ఎప్పుడు భ్రమ పడకూడదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: