దేశంలో కరోనా రోజు రోజుకీ విస్తరిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో డాక్లర్లు వినియోగించే మెడికల్ గౌన్స్, మాస్క్ లు ఇతర సామాగ్రి కొరత ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా కరోనా నేపథ్యంలో ఫోర్డ్ దాతృత్వం చాటుకుంటుంది.  ఇప్పుడొస్తున్న ప్రీమియం సెగ్మెంట్ కార్లలో రక్షణ కోసం ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రముఖ కార్ల తయారీదారు ఫోర్డ్ ఎయిర్ బ్యాగులు తయారుచేసే మెటీరియల్ తో వైద్యసిబ్బంది, రోగులు, ఇతర సిబ్బంది కోసం కోసం ప్రత్యేక మెడికల్ గౌన్లు తయారుచేస్తోంది.

 

ఇప్పటికే అమెరికాలోని ప్లిమౌత్, మిచిగాన్ లోని తన ప్లాంట్లలో 30 లక్షల ఫేస్ షీల్డులు తయారుచేసిన ఫోర్డ్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మెడికల్ గౌన్లు రూపొందిస్తోంది.  ఇవి వారానికి లక్ష వరకు ఈ మెడికల్ గౌన్లు తయారుచేయాలన్నది ఫోర్డ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో 5000 మెడికల్ గౌన్లను అమెరికాలోని వివిధ ఆసుపత్రులకు అందించారు. కాగా, ఫోర్డ్ సంస్థ భారత్ లోనూ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థతో కలిసి ఫేస్ షీల్డుల తయారీలో పాలుపంచుకుంటోంది.

 

 కరోనా మహమ్మారికి బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ అతలాకుతలం అయ్యాయి. అయితే  బ్రిటన్ లో కూడా ఫోర్డ్ దాతృత్వ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. భారీగా వెంటిలేటర్ల ఉత్పత్తి చేయాలని భావిస్తోండగా, ప్రస్తుతానికి ఆ కార్యాచరణ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: