అవును కరోనా విషయంలో అమెరికా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడ కొత్త రికార్డులు అంటే కేసులు, చావుల విషయంలో కాదు.. వాస్తవానికి ఈ విషయాల్లోనూ అమెరికాదే కొత్త రికార్డనుకోండి. ఎందుకంటే.. అమెరికాలో కరోనా చావులు.. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఉన్నాయి. ఇప్పటికే.. 41 వేల మందికి పైగా మరణించారు. ప్రపంచంలో మరే దేశంలోనూ కరోనా కారణంగా ఇంత మంది చనిపోలేదు.

 

 

చావుల్లో అమెరికా దరిదాపుల్లో కాదు.. కదా.. ఇంచు మించు దానిలో సగానికి వచ్చిన దేశాలు రెండో, మూడో అంతే.. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ మాత్రమే 20 వేలకు పైగా చావులు చవి చూశాయి. మరి అలాంటి అమెరికా ఇప్పుడు కొత్త రికార్డు ఎందులో సృష్టించిదంటారా.. కరోనా పరీక్షల్లో.. అవును.. అమెరికా కరోనా పరీక్షల నిర్వహణలో రికార్డు నెలకొల్పిందని ఆ దేశ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 4.18 మిలియన్‌ మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

 

 

ఆ విధంగా కరోనాపై పోరులో తాము ప్రపంచ రికార్డు నెలకొల్పామని డోనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డం, దక్షిణ కొరియా, జపాన్‌, సింగపూర్‌, భారత్‌, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, స్వీడన్‌, కెనడా తదితర పది దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక మందికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాం. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండకపోతే ఇప్పటికే లక్షలాది మంది మరణించేవారని ట్రంప్ అంటున్నారు.

 

 

ఇలా పరీక్షలు నిర్వహించేందుకు అమెరికా పౌరులు సహకరించారని ట్రంప్ మెచ్చుకున్నారు. వాస్తవానికి అమెరికాలో లక్ష కోవిడ్‌ మరణాలు సంభవిస్తాయని అంచనా వేశాం. అయితే ఇప్పుడు 60 వేల మార్కు వద్ద ఆగిపోతామనే నమ్మకం ఉంది. ఇది ఫ్లూ లాంటిదే. మనమంతా జాగ్రత్తగా ఉండాలి అని ట్రంప్ అన్నారు. వాస్తవానికి ఇది శుభపరిణామం.. పెద్ద సంఖ్యలో టెస్టులు జరిపినప్పుడే వాస్తవ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: