చైనా మాల్ అంటేనే ఇండియన్లకు ఓ బ్రాండ్.. అంటే అద్భుతం అని కాదు.. చైనా మాల్ అంటే చాలా చీప్‌గా వస్తుంది.. అదే సమయంలో చైనా మాల్ అంటే నో గ్యారంటీ అని మన ఇండియన్లకు బాగా తెలుసు.. అందుకే చైనా వస్తువు ఒక్కసారి పాడైతే ఇక దాన్ని పారేసి కొత్తది కొనుక్కోవడం మినహా వేరే మార్గం ఉండదు. దానికి గ్యారంటీ కూడా ఉండదు. అలాంటి చైనా ఇప్పుడు కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల విషయంలోనూ అదే క్వాలిటీ మెయింటైన్ చేయడం షాకిస్తోంది.

 

 

అవును.. కరోనాపై పోరాటం కోసం ఇండియా చైనా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు భారీగా దిగుమతి చేసుకుంది. చైనా మాల్ అంటే అనుమానం ఉన్నా.. అత్యవసరం కాబట్టి దిగుమతి చేసుకోక తప్పలేదు. అలా దిగుమతి అయిన కిట్లను తొలుత రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పంపారు. అక్కడ రాజస్తాన్ లో చైనా రాపిడ్ టెస్ట్ కిట్ లు విఫలం అయ్యాయి. ఆ కిట్లు 90% పైగా కచ్చితత్వాన్ని కనపరుస్తాయనుకుంటే.. కేవలం 5.4 శాతమే సరైన ఫలితాలను ఇచ్చాయట.

 

 

దీంతో రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ గగ్గోలు పెట్టారు. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చైనా టెస్టింగ్ కిట్ల కారణంగా పాజిటివ్ గా తేలినవారికీ నెగెటివ్ గా ఫలితాన్ని చూపిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దీంతో ఈ కిట్ల వినియోగం ఆపేయాలని రాజస్థాన్ సర్కారు నిర్ణయించింది. ఆ విషయాన్ని కేంద్రానికి కూడా తెలిపింది. కేంద్రం కూడా యాంటీ బాడీ టెస్టు కిట్ లను రెండు రోజులపాటు ఆపివేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది.

 

 

మరి ఆ చైనా కిట్లను అనుమానపడకుండా అలాగే పరీక్షలు కొనసాగించి ఉంటే.. ఇండియా వల్లకాడు అయ్యే ప్రమాదం ఉంది. పాజిటివ్ వాళ్లను కూడా నెగిటివ్ గా చూపిస్తే.. వాళ్లు వెళ్లి సమాజంలో తిరిగితే దేశంలో కరోనా కేసుల వ్యాప్తి అడ్డుకోవడం ఎవరి తరమూ అయ్యేది కాదు మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: