జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గురించి ప్రపంచంలో తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. తన నియంత పాలన తో ప్రపంచ అగ్రరాజ్యలను  సైతం వణికించిన వ్యక్తి ఎడాల్ఫ్ హిట్లర్. 1889 ఏప్రిల్ 20వ తేదీన జన్మించిన ఎడాల్ఫ్ హిట్లర్... 1993 నుంచి జర్మనీ ఛాన్సలర్గా... 1934 నుంచి మరణించే వరకు జర్మనీ నేత గా వ్యవహరించిన వ్యక్తి. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ స్థాపించి సంచలనం సృష్టించిన వ్యక్తి ఎడాల్ఫ్ హిట్లర్. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ ఆర్థికంగా సైనికంగా భారీగా నష్టపోయిన సమయంలో... మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో గాయపడిన జర్మన్ సైనికుడు ఎడాల్ఫ్ హిట్లర్. ఇక మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన జర్మనీపై మిత్ర రాజ్యాలు ఎన్నో ఆంక్షలు విధించాయి. ఇక ఈ ఆంక్షలే  ఎడాల్ఫ్ హిట్లర్ లోని హేతువాదిని  మేలుకొలిపాయి . జర్మనీ లో ఏర్పడిన విపత్కర పరిస్థితులను ఎడాల్ఫ్ హిట్లర్ తనకు అనుకూలంగా మలుచుకో  సాగాడు. 

 

 

 దీంతో అణగారిన మధ్య తరగతి ప్రజలను ఎడాల్ఫ్ హిట్లర్ తన వాక్పటిమతో ఎంతగానో ఉత్తేజితులను చేసాడు. మధ్యతరగతి అణగారిన వర్గాల అందరికీ జర్మనీ పతనానికి కారణం యూదులే   అంటూ బోధించాడు. ఉపన్యాసాలు ప్రసంగాలతో ఎప్పుడు అతివాద జాతీయత,  యూదు వ్యతిరేకత, సామ్య వాద వ్యతిరేకత ప్రజల్లో  నింపే వాడు ఎడాల్ఫ్ హిట్లర్.  తర్వాత అధికారంలోకి వచ్చాడు ఎడాల్ఫ్ హిట్లర్. ఇక ఆ తర్వాత పతనమైన జర్మనీ ఆర్థిక వ్యవస్థను... నిస్తేజంగా ఉన్న సైనిక వ్యవస్థను గాడిలో పెట్టి సమర్థవంతంగా పనిచేసేలా ముందుకు తీసుకెళ్ళాడు. అతని విదేశాంగ విధానం నియంతృత్వం తోనూ ఒక నియంత్రణ నియంత గా పేరుతెచ్చుకున్నాడు ఎడాల్ఫ్ హిట్లర్. 

 

 

 అధికారంలో ఉన్న సమయంలో ఇతని విదేశాంగ విధానం  లక్ష్యం ఏమిటీ అంటే జర్మనీ సరిహద్దులను క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవడమే. ఇదే ధోరణి తో ఎన్నో రాజ్యాలపై దండెత్తి జర్మనీ భూభాగంలోకి కలుపు  వేసుకున్నాడు. ఇక హిట్లర్ నియంతగా వ్యవహరించడమే రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అక్షరాజ్యాలు ఆయన జర్మనీ ఇటలీ జపాన్ లు  దాదాపు యూరప్ ను జయించాయి. కానీ మిత్రరాజ్యాల చేతిలో హిట్లర్ ఓడిపోయారు. హిట్లర్ జాతి వ్యతిరేక విధానాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయ్యేసరికి సుమారు 1.1 కోట్ల ప్రజలు మరణించారు. ఈ మరణించిన వారిలో 60 లక్షల మందియూదులు  ఉన్నారు. ఈ మరణాలను చరిత్రలో మానవ హసనం గా పేర్కొంటారు.యుద్ధం  చివరి రోజులలో సోవియట్ యూనియన్కు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరంలో లోకి ప్రవేశించగానే  తన భార్య తో కలిసి ఒక నేలమాళిగలో 1945 ఏప్రిల్ 30వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు జర్మనీ నియంత హిట్లర్.

మరింత సమాచారం తెలుసుకోండి: