అమెరికాకి భారతదేశానికి తేడా ఏమిటంటే కరోనా  వైరస్ కారణంగా భారత దేశంలో ఎలాంటి  పరిస్థితులు వస్తాయి. ఎంత మొత్తంలో ప్రజలు  వైరస్ బారిన పడే అవకాశం ఉంది..ఎంత  మొత్తంలో ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది అని చెబితే అది కేంద్ర ప్రభుత్వ అసమర్థత.. నిర్లక్ష్యం అని మీరే మనుషులను చంపేస్తారా అనే ప్రభుత్వంపై అబాండాలు వేస్తారు  ప్రజలు. కానీ అమెరికాలో మాత్రం కరోనా లాంటి క్లిష్టపరిస్థితులు  వస్తే 10 లక్షల మంది కి సోకే అవకాశం ఉంది 70 వేల మంది చని పోయే అవకాశం ఉందని ప్రభుత్వం చెబితే దాని కంటే తక్కువ మందికి  చనిపోతే అది ఒక ఘనత సాధించినట్లుగా ఫీలవుతూ వుంటారు. 

 


 ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ అదే చేస్తున్నారు. అందుకే అమెరికాలో ట్రంపు ప్రభుత్వం ఓపెన్గా ఎంతమంది కరోనా  వైరస్ బారిన పడే అవకాశం ఉంది ఎంత మంది చనిపోయే అవకాశం ఉంది అనేది చెప్పేశారు. దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తమని చెప్పారు... 70 వేల మంది వరకు ప్రజలు  చనిపోయే ప్రమాదం ఉంది దానికి కూడా సిద్ధంగా ఉండండి అంటూ ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ భారతదేశం కంటే విద్యావంతులుమంతులు  ఉన్నారు అంతే కాకుండా అధునాతన టెక్నాలజీ కూడా అమెరికాలో ఉంది కానీ ప్రభుత్వాన్ని  మాత్రం ఎవరు ప్రశ్నించారు. 

 


 ప్రస్తుతం 70 వేల మంది కాదు లక్ష వరకు అమెరికాలో కరోనా  వైరస్ బారినపడి చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. కరోనా  వైరస్ విలయతాండవం సృష్టిస్తూనే ఉంది అని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడిప్పుడే అక్కడ కరోనా  వైరస్  కంట్రోల్  అవుతుంది. కానీ ఒక లక్షమంది వరకు చనిపోతారని మానసికంగా సిద్ధం కావాలని అమెరికా ప్రజానీకానికి మొత్తం ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంటే దీనిబట్టి 80000 దగ్గర మరణాలు ఆగిపోతే ప్రభుత్వం గణత సాధించినట్లే అంటారు. అదే భారతదేశంలో ఇలాంటి మాటలు చెబితే మొత్తం చనిపోయిన వారందరికి మరణాలకు ప్రభుత్వమే కారణం అంటూ ఆరోపణలు చేస్తారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: