ఇది కరోనా కాలం.. దాదాపు అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేక.. చివరకు అంతా పాస్ అనేశారు. ఇక పదో తరగతి పరీక్షలు మొత్తానికే జరగలేదు. అంతా పాస్.. ఇలాంటి సమయంలో జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షలకు పచ్చజెండా ఊపింది.

 

 

కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా గతంలో వాయిదా వేసిన పలు పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. పరీక్షల తేదీల వివరాలతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవన్నీ గతంలో ఆగిపోయిన పరీక్షలకు సంబంధించినవే.. సెప్టెంబర్‌ 15 నుంచి ఉద్యోగ నియామక పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

 

 

ఇక కీలకమైన గ్రూప్ వన్ నియమాకాలు నవంబర్‌ 2 నుంచి 13వరకు నిర్వహించాలని నిర్ణయించింది.

 

మిగిలిన పరీక్షల టైంటేబుల్ ఇదే.

 

 

సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు

 

సెప్టెంబర్‌ 21 నుంచి 24 వరకు గెజిటెడ్‌ ఉద్యోగాల నియామక పరీక్షలు

 

సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో అసిస్టెంట్‌ బీసీ/సోషల్‌/ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ నియామక పరీక్షలు

 

సెప్టెంబర్‌ 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ఇన్‌ మైనింగ్‌ సర్వీస్‌ ఉద్యోగ నియామక పరీక్ష

 

సెప్టెంబర్‌ 23న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల నియామక పరీక్ష

 

సెప్టెంబర్‌ 23న పోలీస్‌ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామక పరీక్ష

 

సెప్టెంబర్‌ 23, 24న పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్‌ విభాగంలో డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నియామక పరీక్ష

 

సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ విభాగంలోఅసిస్టెట్‌ కెమిస్ట్ఉద్యోగాల నియామక పరీక్ష

 

సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ నియామక పరీక్ష

 

సెప్టెంబర్‌ 25, 26, 27 తేదీల్లోనాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల నియామక పరీక్షలు

మరింత సమాచారం తెలుసుకోండి: