ఒక  చిన్న పొరపాటు వల్ల ఒక్కోసారి ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. మనకు ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం అన్ని వేళలా పనికిరాదు.సరి అయినా సమయానికి గమ్యాన్ని చేరడం అనేది మంచి విషయమే కానీ ఆ గమ్యాన్ని చేరడం కోసం మన ప్రాణాల్ని పణంగా పెట్టడం మాత్రం సరికాదు. అలాంటి ఒక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. రైళ్లు రావనుకున్నారో ఏమో తెలియదు గానీ.. కాపలాలేని క్రాస్ వద్దకు ఓ కారు దూసుకొచ్చి ట్రాక్ మధ్యలో ఆగిపోయింది.

 

 

ఇంతలో ఓ రైలు దూసుకురావడంతో కారును కొంత దూరం లాక్కెళ్లి విడిచిపెట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో కొట్టిమిట్టాడుతున్నాడు.అసలు వివరాలలోకి వెళితే  ఎర్రగుంట్ల మండలం వైకోడూరు దాటిన తర్వాత భారతీ సిమెంట్స్‌కు వెళ్లే రైల్వే ట్రాకులో ఎల్సీ 3 వద్ద కారు రైల్వే లైనును దాటుతుండగా ట్రాక్‌పై మధ్యలోకి వచ్చి ఆగిపోయింది. రైలు రాదనుకుని ట్రాక్ ను దాటే ప్రయత్నం చేసాడు. కానీ అనుకొకుండా ట్రాక్ మధ్యలో కారు ఆగిపోయింది. కానీ అప్పుడే భారతీ సిమెంట్స్ నుంచి రెండు రైలింజన్లు వచ్చి కారును ఢీకొట్టాయి.

 

 

 దీంతో కారును రైలు 200 మీటర్ల దూరం లాక్కెళ్లింది.అయితే  రైలు  కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో  రావడంతో  కొద్దీ దూరంలోనే కారు  ఆగిపోయింది. లేదంటే   ఇంకా ఎక్కువగా దెబ్బతినేదని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ మేనేజన్ జాఫర్ హుస్సేన్ తెలిపారు. అయితే కారులో నాగిరెడ్డి, మరో వ్యక్తి  ఉన్నారు. రైలు ఢీకొట్టిన తరువాత  ఇద్దరూ కారులోనే  ఉన్నారని తెలిపారు. వాళ్ళని కారునుంచి బయటకు లాగి  సమీపంలోని ప్రొద్దుటూరు ఆస్పత్రి తీసుకెళ్తుండగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న పొరపాటు ప్రాణాల్ని బలితీసుకుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: