చాలా మంది పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటారు. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ లో బ్యాంకు లో ఎఫ్డీ చేశారా..?  అయితే మీరు వెంటనే ఈ పని చేయండి. లేదంటే మీరు  నష్టపోవాల్సి వస్తుంది. ఆ తరువాత మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్ లో మీకు అకౌంట్ ఉండి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసారా..?  అయితే మీకు ఒక హెచ్చరిక వెంటనే మీరు ఈ గడువులో ఇలా పూర్తి చేయండి. 

 

15g 15h ఫామ్స్ ని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు అందించాలి. లేకపోతే మీ ఎఫ్డీలపై టీడిఎస్ కట్ అవుతుంది. ఇలా చేయకపోతే మీ చేతికి తక్కువ రాబడి కూడా రావచ్చు. ఈ గడువు జూన్ 7తో ముగిస్తుంది కాబట్టి 15g 15h ఫార్మ్స్ ని వెంటనే మీరు సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కు వీటిని అందించాలి లేదంటే అవి మీ ఎఫ్డీఐలపై వచ్చే వడ్డీ మొత్తం లో టీడీఎస్  కట్ చేసుకుంటాయి. దీంతో మీకు పది శాతం టీడీఎస్ కట్ అవుతుంది. అయితే మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలపై ఒక ఆర్థిక సంవత్సరం లో వడ్డీ మొత్తం నిర్ణీత లిమిట్ దాటి ఖచ్చితంగా టీడిఎస్ కట్ చేసుకుంటాయి. ఇలా కట్ అవ్వకుండా  ఉండాలంటే మీరు త్వరగా 15g 15h సమర్పించాలి.

 

ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే మీరు 15h అందించాలి. మిగిలిన వారికి 15g మాత్రమే వర్తిస్తుంది మీరు కనుక వీటిని ఈ గడువులోగా సమర్పించక పోతే మీ మొత్తం ఎఫ్డి లో పది శాతం వరకు టిడిఎస్ కట్ అవుతుంది. దీనిని కనుక  మీరు వెనక్కి పొందాలంటే మీరు ఇన్కమ్ టాక్స్ రిటన్స్  క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్బీఐ కస్టమర్స్  సులభంగానే ఈ ఫార్మ్స్ సబ్మిట్ చేసుకునేలా  ఉంటుంది. దీని కోసం ఈ నెట్ బ్యాంకింగ్ సాయంతో ఇంట్లో నుంచి ఈ ఫార్మ్స్  ని బ్యాంక్ కి  పంపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: