ఈరోజు అనగా, శుక్రవారం నాడు ఏపీ‌ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో భారత్ లో వున్న బ్రిటిష్ తాత్కాలిక హై కమిషనర్‌ అయిన జాన్ థాంప్సన్, మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ మిస్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా... కొవిడ్ పైన నివారణా కార్య క్రమాలు, పరిశోధనలు, వైద్య సేవలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న శ్రద్ధాచర్యలను మిస్టర్ జాన్ థాంప్సన్ ప్రశంసించారు.

ప్రస్తుత కరోనా కాలంలో ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అలాగే ఇండియా మరియు UKలు కలసి కరోనా రక్కసిని ఎదుర్కొనే విషయంలో భేషుగ్గా పనిచేస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్‌, పరిశోధనలు ఇంకా... ఔషధాల తయారీలో ఇరు దేశాలు, మూకుమ్మడిగా సహకరించుకుంటున్నాయి అని గుర్తు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో UK ముందుందని, అలాగే భారత్‌లో కూడా ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిచేసే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలు అద్భుతమని ప్రశంసించారు. అత్యంత భారీగా టెస్టులు చేయడంలో ఏపీ ముందందని, పాజిటివ్ లేదా నెగిటివ్‌ కేసులను గుర్తించండంలో విశేషంగా పనిచేస్తోందన్నారు. అలాగే కరోనా మరణాల రేటు అయితే, పూర్తిగా అదుపులో ఉండడం మామ్మూలు విషయం కాదని అన్నారు. టెలీమెడిసిన్‌ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నదుకు జగన్ ను నిజంగా అభినందించాలి అన్నారు.

అంతే కాకుండా..  ఆరోగ్య, వైద్య, విద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఆశ్చర్యకర రీతిలో చర్యలను చేపడుతోందని, అందుకే ఏపీ మెడ్‌ టెక్‌జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం అని గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందం వైద్య పరికరాల తయారీకి ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి చర్యలు కరోనా లాంటి విపత్తును చాలా గట్టిగా ఎదుర్కోవడానికి, కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: