ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అంటు వ్యాధి వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ దాదాపు 40 శాతం కరోనా రోగులకు లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. బోస్టన్ నిరాశ్రయుల ఆశ్రయంలో దాదాపు 147 మందికి కరోనా నిర్ధారణ అయిందని వాళ్లలో దాదాపు 88 మందికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని చెబుతున్నారు. ఆర్క్‌లోని స్ప్రింగ్‌డేల్‌లోని టైసన్ ఫుడ్స్ పౌల్ట్రీ ప్లాంట్‌లో 481 మంది కరోనా బారిన పడ్డారని చెప్పారు.
481 మంది కరోనా సోకిన రోగులలో 95 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. అర్కాన్సాస్, నార్త్ కరోలినా, ఒహియో మరియు వర్జీనియాలోని జైళ్లలోని 3,277 ఖైదీలు కరోనా బారిన పడ్డారని... వీళ్లలో 96 శాతం మందిలో ఒక్క కరోనా లక్షణం కూడా కనిపించలేదని అన్నారు. తీవ్ర లక్షణాలు కనిపించిన వారితో కలిసి ఉన్నవారిలో కొందరికి కరోనా నిర్ధారణ కాలేదని చెప్పారు.
వైరస్ కొందరికి సోకకపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అన్నారు. కొందరికి కరోనా సోకకపోవడానికి రోగనిరోధక శక్తి కారణమా...? కరోనా వైరస్ మోతాదులో తేడా వల్ల వీళ్లు వైరస్ బారిన పడలేదా...? అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ మిస్టరీని చేధిస్తే వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని తెలిపారు. అదే సమయంలో రోగ నిరోధక శక్తికి కొత్త మార్గాలు సృష్టించవచ్చని... ఈ విధంగా చేయడమే వ్యాక్సిన్ అంతానికి కీలకమని అన్నారు. అధిక శాతం మందికి కరోనా లక్షణాలు కనిపించకపోవడం మంచి పరిణామం అని ఆమె అభిప్రాయపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి