రోజురోజుకు అక్రమ సంబంధాల నెపంతో జరుగుతున్న హత్యలు ఎక్కువైపోతున్నాయన్న  విషయం తెలిసిందే. ఇలాంటి దారుణ హత్య జరిగింది ఇక్కడ . ప్రియుడితో అక్క ఏకాంతంగా ఉన్న విషయాన్ని చెల్లి చూసింది అన్న నెపం తో అక్క దారుణానికి ఒడిగట్టింది. సొంత చెల్లిని దారుణంగా హత్య చేసింది. తర్వాత ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు  ఎంతో ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యింది  సదరు యువతి.  ఈ  ఘటన స్థానికులను అన్నీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్ ఘడ్ లో  వెలుగులోకి వచ్చింది.



 వివరాల్లోకి వెళితే... కోర్బా జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన బాలిక దారుణ హత్యకు గురైంది. సెల్ఫోన్ ఇవ్వకపోవడం కారణంగానే చెల్లిని గొడ్డలితో నరికి చంపినట్లు అక్క అంగీకరించింది . ఇక ఊరు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు చిన్న కూతురు విగతజీవిగా కనిపించడంతో షాక్ అయ్యారు. ఇక హత్య చేస్తానని అంగీకరించినా అక్క ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సెల్ఫోన్ ఇవ్వకపోవడం కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల ముందు హైడ్రామా మొదలు పెట్టింది. పోలీసులకు మాత్రం ఆమె  చెబుతున్న  మాటల పై అనుమానం వచ్చింది.



 ఈ నేపథ్యంలో మరి కొన్ని ఆధారాలు సేకరించి హత్యలో వేరొకరి ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సదరు బాలిక ఫోన్ డేటా ఆధారంగా.. ఎక్కువ సార్లు  ఫోన్ చేసిన నెంబర్ గుర్తించి ఆ ఫోన్ నెంబర్ సమీప  ప్రాంతానికి చెందిన వినయ్ జగత్ ది అని  గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత తనకు హత్యతో సంబంధం లేదని బుకాయించిన యువకుడు... సరైన ఆధారాలు చూపించడంతో నేరం అంగీకరించి అసలు నిజం బయటకు చెప్పాడు. ఎవరికీ తెలియ కుండా ఆమె  తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నానని.. కానీ ఓ రోజు తన ప్రియురాలితో  ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె చెల్లి  చూడటంతో ఈ విషయం బయటకు చెబుతుంది అనే భయంతో హత్య చేసినట్లు అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: