తన భార్యను బెదిరించి ఓ వ్యక్తి మానసికంగా వేధింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు అంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ప్రతి  రోజు తమ ఇంటికి వచ్చి భార్యని లైంగికంగా దోచుకునేవాడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు భర్త. అందుకే తన భార్య ఆత్మహత్యకు  పాల్పడింది అంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు సైతం ఈ కంప్లైంట్ చూసి షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మీరట్ జిల్లాలోని మావానా  పట్టణానికి చెందిన సందీప్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే తన భార్య అకస్మాత్తుగా గత వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.



 భార్య ఆత్మహత్య పై భర్త ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం పై పోలీసులను ఆశ్రయించాడు భర్త సందీప్. పోలీసులు సైతం షాక్ అయ్యే కంప్లైంట్ ఇచ్చాడు భర్త సందీప్. తన భార్య పై అదే ప్రాంతానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రతిరోజు తన ఇంటికి వచ్చి తన భార్యను లైంగికంగా దోచుకునేవాడని.. అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ తన భార్యను వేధించేవాడు అంటూ ఫిర్యాదులో తెలిపాడు  భర్త.



 అంతే కాకుండా తన భార్య కు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టి..  చివరికి తన భార్యను శారీరకంగా దోచుకున్నాడు అంటూ తెలిపాడు. ఓ  రోజు  తన భార్యతో శృంగారంలో ఉన్న సమయంలో దొరికిపోయాడు అంటూ తెలిపాడు భర్త. రోజురోజుకు అర్జున్ వేధింపులు ఎక్కువవడంతో తన భార్య మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది అంటూ  తెలిపాడు.. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. భర్త సందీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం మహిళ ఆత్మహత్య కేసులో ముమ్మర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: