ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా గడ్డం తోనే కనిపిస్తున్న విషయం తెలిసిందే అయితే కొంత మంది మాత్రం గడ్డం పెంచడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా  అని అయోమయంలో ఉంటారు. అయితే గడ్డం పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.




 గడ్డం ని బాగా ఒత్తుగా పెంచడం వల్ల 95 శాతం యూవీ రేస్ తొలిగి.. క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయబడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.



 అంతేకాదు తరచూ షేవింగ్ వల్ల యాక్నే  ప్రాబ్లం వస్తుందట. అయితే గడ్డం పెంచడం వల్ల గడ్డం కింద ఉన్న స్కిన్ ఎంతో మృదువుగా మారడంతో పాటు.. గడ్డం కింద ఉన్న స్కీన్  ఎంతో హెల్దీగా ఉండేందుకు ఆస్కారం వుంటుందట.



 అంతేకాదు గడ్డం పెంచుకుని సరైన షేప్ లో  వుంచు కున్నవారు  ఎంతో మెచ్యూర్డ్ గా  కనిపిస్తారని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. అంతేకాక  ఎట్రాక్టివ్గా హెల్దీ  గా ఉంటారు అని కొన్ని సర్వేలు  కూడా చెబుతున్నాయి.



 ఇక గడ్డం ఏకంగా మగవారి కాన్ఫిడెన్స్ ను కూడా పెంచే అవకాశం ఉందట. చాలామంది కాన్ఫిడెన్సు ని పెంచే విషయంలో క్లీన్ షేవ్ కంటే గడ్డానికి ఎక్కువగా ఓట్లు వేశారట ఓ సర్వేలో.



 ఎక్కువగా గడ్డం పెంచడం కారణంగా.. గడ్డం నాచురల్ ఫిల్టర్ గా పనిచేసి ఎలాంటి దుమ్ము ధూళి చర్మం పైకి పడకుండా అంతే కాకుండా ముక్కు లోకి వెళ్ళకుండా కూడా అడ్డుకుంటుందిట.




 అయితే గడ్డం పెంచడం వల్ల ఎంతోమంది యంగ్ గా  కనిపించడమే కాదు కొంతమంది వయసు అయిపోయిన వారు కూడా ఎంతో యంగ్ గా ఫీల్ అవుతూ వుంటారట. షేవింగ్ చేయకుండా గడ్డం పెంచడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుందట.



 మరో విషయం ఏమిటి అంటే గడ్డం పెంచడం వల్ల ముడతలు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గడ్డం ఎలర్జీ కారకాలను  కూడా ఎప్పుడు దూరం చేస్తూ ఉంటుందట.



 ఇక వివిధ రకాల బ్యాక్టీరియా నుంచి కూడా గడ్డం ప్రొటెక్ట్ చేస్తోందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గడ్డాన్ని ఎక్కువగా పెంచుకుని మంచి షేపులో ఉంచుకోవడం ద్వారా ఎప్పుడు ఎదుటి వాళ్ళకి కూల్ గా కనిపిస్తూ ఉంటారట . అంతే కాదు ఎంతో సులభంగా గడ్డం ఉన్న వారిని చూసి ఎదుటివాళ్ళు ఆకర్షితులవుతారట. ఈ విషయాలు పలు సర్వేల్లో వెల్లడయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: