ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న కరోనా వైరస్ ఎంతోమందిని బలితీసుకుంటోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడంతో అధికార ప్రభుత్వాలు మరియు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్యన కొంచెం దీని ప్రభావం తగ్గినట్లు కనిపించినా మళ్ళీ తిరిగి పుంజుకున్నట్లు వైద్య అధికారులు తెలుపుతున్నారు. దీని విరుగుడికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రపంచంలోని అనేకమంది వైద్య శాస్త్రజ్ఞులు మరియు పాలక ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అయితే ప్రజలు కూడా చాలా జాగ్రతగా శానిటైజర్ వాడడం, మాస్కును పెట్టుకోవడం సామాజిక దూరాన్ని పాటించడం వంటివి పాటిస్తూ ఈ మహమ్మారిని అంతంచేయాలి.  

కరోనా తారతమ్యం లేకుండా సామాన్య ప్రజలనుండి రాజకీయనాయకులకు, మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు వ్యాపిస్తూ ఇబ్బందిపెడుతోంది.  ఇప్పుడు తాజాగా ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా... కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో ఆమె ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇదే క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరో పక్క దేశంలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.  రెండురోజుల క్రితం రోజున కాస్త తగ్గినట్టు కనిపించినా ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కేసులు తిరిగి పెరిగాయి.

తాజా బులెటిన్ ప్రకారం, ఇండియాలో కొత్తగా 80,472 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764కి చేరింది.  ఇందులో 9,40,441 కేసులు యాక్టివ్ గా ఉంటె, 51,87,826 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. మరి ఈ కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గి ప్రజలు మళ్ళీ సాధారణంగా బయట తిరుగుతారో అని ఆసక్తిగా ఉన్నారు. అయితే మరో ఏ కరోనా మహమ్మారి వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో అతి త్వరలోనే శుభవార్త రానున్నట్లు ప్రభుత్వాలు తెలుపుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: