హైదరాబాద్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. గత 30-40 ఏళ్లలో ఎన్నడూ రాని స్థాయిలో హైదరాబాద్ లో వరదలు వస్తున్నాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. దీనికి తోడు వర్షం గ్యాప్ ఇవ్వకుండా కొడుతూనే ఉంది. విచిత్రం ఏంటంటే.. ఈ హైదరాబాద్ వరదలకూ లాక్‌ డౌన్‌ కూ కూడా లింక్ ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి ఇది వర్షా కాలం కూడా కాదు.. కానీ.. మరి ఎందుకు ఇంతగా వానలు పడుతున్నాయి. ఈ అంశంపైనే వాతావరణ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. వారి పరిశోధనలో తేలిందేమిటంటే.. గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ పెరగిందట. మరి ఈ తేమ ఎందుకు పెరిగింది అంటే అందుకు కారణం లాక్‌ డౌన్ అని చెబుతున్నారు. కరోనా కారణంగా  గత మార్చి 22 నుంచి జులై వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా అనే పరిశ్రమలు మూతబడ్డాయి.

అందువల్ల గాలిలో కాలుష్యం బాగా తగ్గింది. అలా కాలుష్యం తగ్గడం వల్ల గాలిలో స్వచ్ఛత ఏర్పడింది. ఈ స్వచ్ఛత కారణంగా తేమ పెరిగింది. ఇలా తేమ పెరగడం కారణంగా వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి ఇప్పటి కల్లా నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవాలి.. కానీ ఇలా వరుస అల్పపీడనాల కారణంగా నైరుతి రుతుపవాల నిష్క్రమణలో జాప్యం వచ్చింది. అంతే కాదు.. దీనికితోడు ఫసిఫిక్‌ మహా సముద్రంలో ఏటా ఉండే ఎల్‌నినో కూడా ఈ వరదలకు కారణమని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు.

నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనక్కు వెళ్లకపోవడంతో బంగాళాఖాతంలో వాతావరణం ప్రశాంతంగా ఉండడంలేదు. ఈ నెలలో ఇప్పటికే ఒక అల్పపీడనంతో తీవ్రగాలులు, వర్షాలు కురిశాయి. ఇంకా కురిసే అవకాశం ఉంది. సో.. ప్రకృతిలో ఏదైనా  ఓ క్రమం ప్రకారం జరగాలి.. అకస్మాత్తుగా ఏదైనా పెరిగినా... తగ్గినా సమతుల్యం దెబ్బతింటుంది.. వర్షాకాలం ముగిశాక ఇలా అక్టోబరులో ఈ కుండపోత వర్షాలేంటని పరిశోధించిన శాస్త్రజ్ఞులకు ఈ సమాధానాలు దొరికాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: