ప్రధాని మోడీకి ఎన్నికల్లో ఓటమి అనేది లేదు. అంతే కాదు, ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలకు కూడా తిరుగులేదు. ఈ దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అనేక క్లిష్ట సమస్యలకు మోడీ ప్రధాని అయ్యాక ఒక దారి చూపించారు. ఆ విధంగా దేశమే కాదు, చరిత్ర కూడా మోడీని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే కాశ్మీర్ ని రెండు ముక్కలు చేస్తూ మోడీ సర్కార్ గత ఏడాది తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించింది. కానీ ఎవరూ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోయారు. ఇపుడు కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి.

మోడీ సైతం కాశ్మీర్ ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అక్కడి పరిస్థితులను పూర్తిగా నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు చేయాల్సిన కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చాలాకాలంగా గృహ నిర్భంధంలో ఉంచిన కాశ్మీర్ నేతలు పెద్ద పార్టీల అధినేతలూ అయిన ఫరూఖ్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీ బయటకు వచ్చాక ఇద్దరూ ఒక్కటి అయ్యారు. నిజానికి ఇది చాలా అరుదైన ఘటనగా చెప్పాలి.

దశాబ్దాలుగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రసీ పార్టీ రెండూ కూడా బద్ద శత్రువులు. ఈ రెండు పార్టీలే  కాశ్మీర్ మొత్తాన్ని పాలిస్తున్నాయి. కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి వచ్చాక షేక్  అబ్దుల్లా, ఆయన తరువాత ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రులుగా  పాలించారు. ఇక ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కాంగ్రెస్ నుంచి వేరు పడి సొంత పార్టీ పెట్టి రెండు సార్లు సీఎం అయ్యారు. ఆయన కుమార్తె పీడీఎఫ్ నాయకురాలు మొహబాబా ముఫ్తీ కూడా ఒకసారి సీఎం అయ్యారు.

ఎపుడైతే కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి రద్దు అయిందో నాటి నుంచే ఈ రెండు పార్టీలు ఒక్కటిగా పోరాటం చేస్తున్నాయి. అదే అస్తిత్వంగా చేసుకుని  తమ రాజకీయాన్ని నడిపిన ఈ పార్టీలకు ఇపుడు అక్కడ రాజకీయ ఉనికి ప్రశ్నగా మారింది. దాంతో ఇపుడు ఒక్కటిగా నిలిచి కాశ్మీర్ లో మళ్ళీ 370 ఆర్టికల్ ని పునరుద్ధరించేందుకు ఉద్యమించాలని కూడా డిసైడ్ అయ్యాయి.  మరి చూడాలి ఈ పోరాటం ఏ మలుపు తీసుకుంటుందో. ఏది ఏమైనా మోడీకి బిగ్ చాలెంజ్  ని వీరు విసిరారు. ఆయన ఎలా తట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: