ఎన్నికలంటేనే..... రాజకీయరంగంలో ఒక మహా ఘట్టం. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఆ హోరాహోరి విశేషాలు అందరికీ తెలిసినవే, ఎన్నో హామీలు మరెన్నో సంచలన వ్యాఖ్యలు.. ఏ ఊరిలో చూసినా ఎన్నికల సందడి మామూలుగా ఉండదు. ఓ పక్క ప్రముఖ నాయకులు వారి పార్టీ కోసం ప్రచారంలో మునిగి తేలుతుంటే... మరోపక్క వారి అనుచరులు అలాగే వివిధ పార్టీలను అభిమానించే కార్యకర్తలు ఫుల్ జోష్ తో వారి అభిమాన పార్టీవైపు అండగా నిలబడతారు. ఇప్పుడు ఇదే తరహాలో బీహార్లో ఎన్నికల సందడి మరియు రణరంగం మొదలైంది. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీల హామీలతో.... వారి ప్రసంగాలతో.... ఓటర్లు ఎటూ తేల్చుకోలేని స్థితిలో సతమతమవుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో జరిగే పరిణామాలు అందరికీ తెలిసినవే.... అలాంటివి కొన్ని చోటుచేసుకోగా...కాగా బీహార్ లోని 108 గిరిజన గ్రామాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పోలీసుల దాడికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తామని గొంతెత్తి ప్రకటించాయి. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటంటే...

ఇటీవల కైమూర్ ప్రాంతంలో పోలీసులు తప్పుడు కేసులు మోపి 25మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసిన కారణంగా, పోలీసులను ఉపయోగించి అటవీశాఖ బలవంతంగా దాడులు చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకొని అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని తమ భావాన్ని వ్యక్తం చేశారు. కైమూర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించడాన్ని అక్కడి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు... అంతేకాదు వారి ఆవేదనను ఆందోళనలుగా చేపట్టారు. వారిని ఆపే ప్రయత్నం చేసిన పోలీసులకు....ఈ గిరిజన గ్రామాల ప్రజలను బలవంతంగా అక్కడి నుంచి తరలించడాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

108గ్రామాలకు చెందిన వేలాది మంది ఆదివాసీలు అధౌరా అటవీ శాఖ కార్యాలయం ముందు సెప్టెంబరు 10న శాంతియుతంగా నిరసన జరుపుతుండగా పోలీసులు మాత్రం అన్యాయంగా వారిపై ఆగ్రహాన్ని చూపాయని  పేర్కొంది. లాఠీఛార్జ్ కూడా జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు నివేదిక ఆరోపించింది. దీనికి నిరసనగా ఆ గ్రామాల వారు ఎన్నికలను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది..... మరి ఇది ఏ వివాదానికి దారి తీస్తుందో అని అందరూ చింతిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: