రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్నంత వేడి గతంలో ఎప్పుడు లేదని చెప్పాలి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి రాజకీయాలు ఎంతో ఆసక్తి గా ఉన్నాయి.. జగన్ రాష్ట్రన్ని అభివృద్ధి చేసే విధంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.. దానికి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం, ఆరోపణలు రోజు రోజుకు మించి పోతున్నాయి.. అయితే ప్రజల శ్రేయస్సు కోసం జగన్ ఇవన్నిచేస్తున్నాడని ఎందుకు టీడీపీ నేతలు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు..  

ఇప్పటికే టీడీపీ లోని చాలామంది సీనియర్ నేతలు  అవినీతి కి పాల్పడ్డ వైసీపీ నాయకులను బహిరంగంగా విమర్శిస్తున్నారు. మరో వైపు జగన్ టీడీపీ నాయకుల్లో అవినీతి కి పాల్పడ్డ వారిని జైలుకి పంపిస్తున్నాడు.. మరోవైపు చంద్రబాబు కూడా జగన్ అవినీతి గురించి బట్టబయలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.. ఈ నేపథ్యంలో ముందు ముందు ఎం జరుగుతుందో తెలీదు కానీ ప్రజలు మాత్రం వైసీపీ తరపున ఉన్నారని మాత్రం తెలుస్తుంది.. జగన్ పాలనాకు ఫిదా అయిన వారి వచ్చే ఎన్నికల్లోనూ జగన్ నే గెలిపించాలని డిసైడ్ అయ్యారు.

ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై వేసిన సిట్‌.. తన దర్యాప్తును మరో నెల రోజుల్లో పూర్తి చేయనుంది. నవంబర్‌ నెలాఖరుకు దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సిట్‌ అధిపతి విజయ్‌కుమార్‌ ఇటీవల చెప్పారు. అయితే ఈ నివేదిక లో ఎం ఫలితాలు వస్తాయో అని అన్ని పార్టీ కొంత టెన్షన్ గా చూస్తున్నాయట..టీడీపీ, వైసీపీ నేతల ఆరోపణలు, విమర్శలు ఎలాగున్నా.. సిట్‌ నివేదిక తర్వాత.. టీడీపీకి నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎలా స్పందిస్తారనేదే ఆసక్తికర అంశం. విశాఖలో భూములు ఆక్రమించుకుంటున్నారనే విషయం వెలుగులోకి రాగానే వాటిపై నాడు మంత్రిగా ఉన్న అయ్యన్న తీవ్రంగా స్పందించారు. తన సహచర మంత్రి అయిన గంటా శ్రీనివాసరావుపై పరోక్షం ఆరోపణలు చేశారు. ఎక్కడ నుంచో విశాఖకు వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: