తెలంగాణ ఇచ్చిన పార్టీగా క్రెడిట్ కొట్టి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో  రెండుసార్లు అధికారానికి దూరమై,  ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. భవిష్యత్తులో అయినా, కాంగ్రెస్ పుంజుకుంటుంది  అనే నమ్మకాలు ఎవరిలోనూ లేవు. ఇక ఏపీలో పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో కాస్తోకూస్తో బలం ఉన్నా, ఏపీలో మాత్రం నాయకులు అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. అది కూడా రాజకీయ ప్రత్యామ్నాయం లేని వారు , రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని వారు , రిటైర్మెంట్ వయసు దాటిన వారు కొంతమంది కాంగ్రెస్ ను పట్టుకుని వేలాడుతున్నారు. 



కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారయింది.దీనంతటికీ కాంగ్రెస్ పెద్దల స్వయంకృతాపారాధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇది ఇలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కు రిపేర్లు చేసి మళ్లీ, పునర్వైభవం సాధించాలి అని ఆ పార్టీ అగ్ర నాయకులు చూస్తున్నారు. కానీ ఆ ఆశలు అడియాసలు అన్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు పోయిన క్యాతి తెచ్చుకునేందుకు,  పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చేందుకు అగ్రనాయకత్వం నడుంబిగించింది. శరధ్ పవర్, మమతా బెనర్జీ వంటివారితో మొదలుపెట్టి జగన్ వరకు అందర్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పతనావస్థకు చేరుకోవడం , ఇటీవల బీహార్ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపించ లేక పోవడం వంటి వ్యవహారాల కారణంగా,  కాంగ్రెస్ కు వచ్చేలా  కనిపించడం లేదు. 


అయితే కాంగ్రెస్ ను క్షమించే విషయంలో జగన్ ఏమాత్రం రాజీ పడరు. ఎందుకంటే ఆయన 16 నెలలపాటు జైలు జీవితం గడిపి వచ్చారు. అంటే, అదంతా కాంగ్రెస్ కక్ష సాధింపు. చర్య అనే విషయం జగన్ కు తెలుసు. అందుకే కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడరు. ఆయనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ వైపు అడుగులు వేసేందుకు ఎవరు సాహసించడం లేదు అన్నట్టుగానే పరిస్థితి నెలకొంది.
.

మరింత సమాచారం తెలుసుకోండి: