తెలంగాణలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశం ఉందని భావించిన ఆ పార్టీ అనుకున్న విధంగా పరిస్థితి మాత్రం కనబడడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న సరే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా భారతీయ జనతా పార్టీ ని ఎదుర్కొనే అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవాలంటే కొన్ని కొన్ని అంశాల మీద ఎక్కువగా విమర్శలు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి దాని మీద ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ప్రధానంగా సరిహద్దుల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని టిఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని నేరాలను టార్గెట్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రధానంగా అత్యాచారాల విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. కాబట్టి వాటిని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సుఖంగా లేరు అనే అంశాన్ని ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కాస్త బలంగా వినిపించడానికి రెడీ అవుతుంది. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది చూడాలి. ఇక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళడం కంటే కూడా బిజెపి మార్గంలో వెళ్లి బిజెపి ని ఎదుర్కోవాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఎంతవరకు ఫలిస్తుందో రాజకీయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: