ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హడావుడి భారతీయ జనతా పార్టీలో ఎక్కువగా ఉంది. పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్చే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

త్వరలోనే దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆయన సమర్థవంతంగా పని చేయలేదు అనే భావన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఊహించిన విధంగా ఆయన పనిచేయకపోవడంతో టిఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే భావన చాలా మంది వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రచారం చేసిన ఆయన ఆ తర్వాత మాత్రం ఘోరంగా వెనుకబడ్డారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ ఎన్నికల్లో విద్యావంతులు ఎక్కువగా ఉంటారు వారిని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయాల్సిన అవసరం అనేది ఉంది. కానీ బండి సంజయ్ మాత్రం వారిని ఆకట్టుకోలేకపోయారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఈ ఎన్నికల తర్వాత ఆయన పదవి పోయే అవకాశాలు ఉన్నాయని కొంతమంది భావిస్తున్నారు అయితే ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారు ఏంటీ అనేది తెలియదు కానీ దాదాపుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ధర్మపురి అరవింద్ ని నియమించే  అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: