మారుతున్న రాజకీయ పరిస్థుల నేపథ్యంలో తెలంగాణాలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి చాలినంత స్పేస్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ కొత్త పార్టీకి
రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తే బాగుంటుందన్నది అత్యధికుల అభిప్రాయం. ప్రస్తుతం
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత
తెరాస అధికారంలోకి వచ్చి విపక్షాలన్నిటినీ గులాబీ గూట్లోకి చేర్చుకోవడంతో
టీడీపీ ఉనికి కోల్పోయింది.
కాంగ్రెస్ బాగా బలహీనపడింది. ఎన్నికల్లో సింగల్ డిజిట్ ఓటమి తప్ప గెలిచే అవకాశాల్ని కోల్పోయింది.
తెరాస లోకి వెళ్లలేనివాళ్ళు మాత్రమే రాజకీయ ఉనికి కోసం
కాంగ్రెస్ ని ఇంకా అంటిపెట్టుకుని ఉంటున్నారు తప్ప ఆ పార్టీలో భవిష్యత్ ఉందని ఆశ కూడా వాళ్లకి లేదంటే అతిశయోక్తి కాదు.
దాంతో
బీజేపీ మాత్రమే
తెరాస కి ప్రత్యామ్నాయం అనే పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగిన దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైనది.
ఈ నేపథ్యంలో
కాంగ్రెస్ లో ఉంది భవిష్యత్ వెతుక్కోవడం
కన్నా సొంతంగా తానే
పార్టీ పెట్టి నడిపిస్తే మంచిదంటూ ఆత్మీయులు ఆయనకు సలహాలు ఇచ్చారని...ఆ మేరకు ఆయన కూడా ఈ విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం.
గతంలో
కాంగ్రెస్ హయాంలో
రెడ్డి సామాజిక ప్రభావం జోరుగా సాగింది. ప్రస్తుతం అధికారానికి ఆమడ దూరంలో ఉన్న ఆ సామజిక వర్గానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే కచ్చితంగా మరో ప్రాంతీయ
పార్టీ ఆవిర్భవించాల్సిందేనని
రేవంత్ రెడ్డి అనుయాయులు భావిస్తున్నారు. ఆ ప్రాంతీయ పార్టీకి
రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తే భవిష్యత్ బాగుంటుందని ఆశిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల తర్వాత టిపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్
కుమార్ రెడ్డి రాజేనామె చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది.ప్రస్తుతం కొత్త పీసీసీ రేసులో
రేవంత్ రెడ్డి పేరు కూడా జోరుగా వినిపిస్తున్నా...ఆయనని ఆ పదవికి ఎంపిక చేయరని పలువురి అభిప్రాయం. కారణం...మహా సముద్రం లాంటి
కాంగ్రెస్ లో ఏది జరగాలన్నా మళ్ళీ
ఢిల్లీ పెద్దల జోక్యం తప్పనిసరి. ఎంతలా వారిని ఆకట్టుకున్నా
కాంగ్రెస్ లోని సీనియర్స్ ని కాదని
రేవంత్ రెడ్డికి పట్టం కట్టారని పరిశీలకులు కూడా అనుకుంటున్నారు. సో...రేవంత్
రెడ్డి కొత్త
పార్టీ పెడితే, ఆయనే అధ్యక్షుడిగా పార్టీని నడిపించొచ్చు. ఎవరి దయమీదో వచ్చే పదవి
కన్నా సొంతంగా తానే ఆ పదవిని సృష్టించుకుని ముందుకు సాగితే ఎలా ఉంటుందోనని వ్యూహ
రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొలిక్కి వస్తే
రేవంత్ రెడ్డి కొత్త
పార్టీ త్వరలోనే ప్రజల ముందుకు రావొచ్చు.