అసలు టీడీపీ హయాంలో, బీజేపీ పరోక్షంలో ఏమేం జరిగాయంటే..?- టీడీపీ హయాంలో రూ.437 కోట్లు విలువ చేసే దుర్గగుడి భూముల్ని సిద్దార్థ కాలేజీకి కారు చౌకగా రూ.21 లక్షలకు అగ్రిమెంట్ చేశారు. అప్పుడు బీజేపీ చూస్తూ ఉందని విమర్శించారు మంత్రి వెల్లంపల్లి
- మంత్రాలయానికి చెందిన 200 ఎకరాల భూముల్ని అమ్ముకోవచ్చంటూ అప్పటి బీజేపీ మంత్రి మాణిక్యాలరావు జీవో ఇచ్చారు. ఆలయ ఆస్తుల రక్షణకోసం హడావిడి చేస్తున్న బీజేపీకి తమ హయాంలో జరిగిన తప్పులు తెలియవా అని ప్రశ్నించారు మంత్రి.
- అనంతపురం జిల్లా జూటూరు గ్రామంలో 18.3 ఎకరాలను జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజీకి కారు చౌకగా కట్టబెట్టారని, టీడీపీ నేతలకు చాలా మేళ్లు చేశారని, చివరకు వైసీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
- విశాఖపట్నంలో ప్రేమసమాజంకు సంబంధించిన 33 ఎకరాల భూముల్ని ఓ రిసార్ట్ కి ఇచ్చారు. అసలు రిసార్ట్ లకు భూములు ఇవ్వడం ఎక్కడి సంప్రదాయం అని అడిగారు మంత్రి. కమర్షియల్ వ్యవహారాలకు ఇలాంటి భూముల ఇస్తారా అని ప్రశ్నించారు.
- 83 ఎకరాల సదావర్తి భూములను అమ్మకానికి పెట్టింది కూడా టీడీపీ హయాంలోనే అని గుర్తు చేశారు. .
- అమరావతి అంటూ.. అమరేశ్వరుడి భూములు అమ్ముకోవాలని ప్రయత్నం చేశారని, వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డు పడటంతో టీడీపీ పప్పులు ఉడకలేదని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సెంటు కానీ ఒక్క గజం కానీ దేవాలయాల భూమి అన్యాక్రాంతం కాలేదని స్పష్టం చేశారు. చర్చిలు, దర్గాలకు డబ్బులిస్తున్నారని విమర్శిస్తున్న వారికి.. రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్న దుర్గగుడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మంత్రి. దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నందుకు, అన్యాక్రాంత భూములను వెనక్కి తీసుకున్నందుకు తాను రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టొద్దని బీజేపీ శ్రేణులకు హితవు పలికారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి