
కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై ప్రజల్లో సందేహం నెలకొంది. మనమే ఒకసారి ఆలోచిస్తే ఎవరికీ కేంద్రం ముందు ప్రాధాన్యతని ఇస్తుందో తెలిసిపోతుంది .. మీరు డాక్టర్, నర్సులు, కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించే వారు అయితే మీకు తొలిదశలోనే కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది. మీరు ఆర్మీ లేదా పోలీస్ అయితే మరియు మున్సిపల్ వర్కర్ టీచర్ అయితే మీకు ఆ తర్వాత ప్రాధాన్యం లభిస్తుంది...అలాగే మీరు మీరు 50 ఏళ్ల కంటే పెద్దవారు అయితే, తదుపరి ప్రాధాన్యం మీకే ఇస్తారు.
ఒకవేళ మీరు కోవిడ్ 19 హాట్ స్పాట్ లో ఉండే వారు అయితే, మీకు టాప్ ప్రయారిటీలో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. పైన చెప్పిన వాటిలో ఏ కేటగిరీకి చెందని వారు అయితే, మీకు కరోనా వ్యాక్సిన్ ఆలస్యంగా వస్తుంది.అయితే, అసలు వ్యాక్సిన్ ఎప్పటి నుంచి వేయడం ప్రారంభిస్తారని విషయాన్నీ కేంద్రం ఇప్పటివరకు చెప్పడం లేదు ... ప్రస్తుతం దేశంలో పలు రకాల వ్యాక్సిన్లు ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలో ఏ వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేదానిపై కూడా క్లారిటీ లేదు. మరి కేంద్రం పార్లమెంటరీ ప్యానల్ చెప్పినట్టు చేస్తుందా అంటే ఆలోచించదగ్గ విషయమే .. చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుందో ..