వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ జరిగిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించడం తో ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఇన్నిసుపేట దుర్గమ్మ గుడి వీధికి చెందిన రాము అనే వ్యక్తికి కూతురు రోహిణి ఉంది. ఇటీవలే ఇంటివద్ద ఆడుకుంటున్న సమయంలో.. అదే ప్రాంతం లో ఉండే సత్య నారాయణ అనే వ్యక్తి సదరు బాలికకు మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకుని వెళ్ళాడు.
అయితే కాసేపటికి కూతురు కన్పించక పోవడంతో తల్లి దండ్రులు కంగారు పడిపోయారు. స్థానికులను అడగగా సత్యనారాయణ బైక్ పై ఎక్కించుకుని వెళ్ళాడు అన్న విషయాన్ని చెప్పారు. దీంతో అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలికను అపహరించిన సత్య నారాయణ దేవరపల్లి మండలం తిరుగుడు మెట్ట వద్ద ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. అయితే ఏలూరుకు చెందిన సీతారత్నం జ్యోతి అనే మహిళలు బాలికను పెంచుకుంటామని చెప్పడంతోనే ఇలా అపహరించినట్లు పోలీసులు కారణం చెప్పాడు సత్యనారాయణ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి