అయితే శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలైందని ప్రస్తుతం అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. కానీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు వ్యాక్సిన్ విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ ఉండటం దురదృష్టకరం. ఇటీవలె అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు బిజెపి వ్యాక్సిన్ అంటూ వ్యాఖ్యానించడం.. ఇక మరికొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడంవల్ల నపుంసకత్వం వస్తుంది అని తప్పుడు ప్రచారాలు చేయడం లాంటివి చేశారు. అటు కాంగ్రెస్ కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ పై విమర్శలు గుప్పిస్తోంది. జైరామ్ రమేష్, శశి ధరూర్, ఆనంద్ శర్మ లాంటి కాంగ్రెస్ నేతలు.. మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు రాకముందే డీసిజిఐ అసలు ఎలా వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చింది.
మూడో విడత ఫలితాలు రాకముందే వ్యాక్సిన్ వినియోగానికి ఎలా అనుమతి ఇస్తారు దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ ఇవ్వాలి అంటూ విమర్శలు గుప్పించారు. నిపుణుల కమిటీ సూచనమేరకు అనుమతి ఇచ్చామని వ్యాక్సిన్ వందకి 110% ప్రమాదకరం కాదు అని డీసిజిఐ స్పష్టం చేస్తూ ఉంటే అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం వ్యాక్సిన్ వచ్చినందుకు ఏడుస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలు చేయడంపై విశ్లేషకులు మండిపడుతున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి