ఎందుకంటే తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడం వల్ల, ఎమ్మెల్యేల జంపిగ్ ఉండదని అనుకున్నారు. కానీ తమ పదవులకు రాజీనామా చేయకుండా, అలాగే వైసీపీలో చేరకుండా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇదో కొత్తరకమైన జంపింగ్. అయితే అధికార పార్టీ ఈ ఎమ్మెల్యేలని ఓ వ్యూహం ప్రకారమే చేర్చుకుంది.
చంద్రబాబు ఇసుక పోరాటం చేసే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీని వీడి జగన్‌కు జై కొట్టారు. అలాగే అమరావతి ఉద్యమం ఉదృతి సాగుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ వైపు వచ్చారు. అలాగే స్థానిక సంస్థల నామినేషన్స్ సమయంలో టీడీపీలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన కరణం బలరాం జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. విశాఖలో టీడీపీని దెబ్బకొట్టడంలో భాగంగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి లాగారు.
ఇలా నలుగురు ఎమ్మెల్యేలు బాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టారు. అయితే రాబోయే రోజుల్లో ఓ వ్యూహం ప్రకారమే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు రావోచ్చని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు జరిగేప్పుడు టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వస్తారని తెలుస్తోంది. అలాగే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే సమయంలో అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరోకరు చంద్రబాబుకు షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది. మొత్తానికైతే ఓ వ్యూహం ప్రకారమే టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ జరుగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి