తెలంగాణా లో రాజకీయం ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతుంది. బీజేపీ బలపడడంతో తెరాస కు ఇప్పుడు గట్టి ప్రత్యర్థి దొరికినట్లయింది.. దుబ్బాక ఉప ఎన్నిక లో విజయంతో ఒక్కసారిగా కాషాయం పార్టీ లైం లైట్ లోకి వచ్చింది.. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు ల తర్వాత తెలంగాణా లో బలమైన లీడర్ లా అవతరించాడు. తెలంగాణా లో రాజకీయం చేయడంలో కేసిఆర్ కు మించి ఇప్పటివరకు ఎవరు లేరనే వాదనను తోసి పోచ్చుతూ బండి సంజయ్ ఆ రాజకీయాల్లో పండిపోయాడు..

తక్కువ సమయంలో కేసిఆర్ రేంజ్ లీడర్ అనిపించుకున్తున్నాడు.. హిందుత్వ వాదాన్ని ముందు పెట్టుకుని మైనార్టీలను టార్గెట్ చేస్తూ అయన చేస్తున్న రాజకీయం అంత శ్రేయస్కరం కాదని తెరాస వాదిస్తుంటే బీజేపీ మాత్రం మొండి వైఖరితో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు పోతుంది. ఇటీవలే సర్జికల్ స్ట్రైక్ అంటూ పాతబస్తీ పై అయన చేసిన వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి.. అది మరిచిపోకముందే ప్రమాణం పేరుతో ..ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు రావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు.. ర్యాలీగా వెళ్లారు.. కేసీఆర్ ఎలాగూ రారు..అందుకే భాగ్యలక్ష్మికి పూజలు చేసి వచ్చారు.

ఇకపోతే భవిష్యత్ లో పార్టీ ని దూకుడు గా తీసుకెళ్లేందుకు ఎవరి ప్రణాళికలు వారు వేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ లో వరుస ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ క్షణంలో లో అయినా జరగవచ్చు.. నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. సాగర్ లో ఉప ఎన్నిక ఉండనే ఉంది.. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపెట్టాలని ప్రణాళికలు వేస్తుంది. టీ ఆర్ ఎస్ కూడా బీజేపీ ని నిలువరించేందుకు ప్లాన్ చేసుకుంటుంది.. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ ల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ రాజకీయ వేడి ని పుట్టిస్తారని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: