సాధారణంగా ఏవైనా జంతువులు పోరాడుతున్నాయి అంటే చాలు వాటికి దూరంగా ఉంటారు ఎంతోమంది. ఎందుకంటే వాటి పోరాటం ఎంత హోరాహోరీగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కొన్ని సార్లు వాటికి దగ్గరగా ఉంటే పక్కన ఉన్న వాళ్ళ ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లు ఎంతో కొత్తగా ఎవరికీ తెలియని విషయాలను కూడా తమ కెమెరాల్లో బంధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.  అయితే ఇలా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లు ఇప్పటివరకు రెండు సింహాలు దెబ్బలాడటం.. రెండు పులులు కొట్టుకోవడం.. ఎన్నో సార్లు తమ కెమెరాల్లో బంధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు అన్న విషయం తెలిసిందే.



 కానీ ఊహించని జంతువులు దెబ్బ లాడుతూ ఉండడం మాత్రం కొన్ని కొన్ని సార్లు కెమెరాలకు చిక్కుతూ  ఉంటాయి. అలాంటి అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నీళ్లల్లో చిరుత అనుకొండ పోరు ప్రస్తుతం అందరినీ నోరెల్లబెట్టేలా చేస్తుంది. ఇటీవలే బయో డైవర్సిడ్  బ్రెజిలేరియా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో ని పోస్ట్ చేయగా ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 దట్టమైన అడవిలో సెలయేటి లో అనకొండను పట్టుకునేందుకు బ్లాక్ పాంథర్ ప్రయత్నిస్తూ హోరాహోరీగా తలపడుతూ  ఉన్న వీడియో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  దాదాపు 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు అలాగే నోరేళ్ళ బెడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ పాంథర్.. అనకొండ మధ్య జరుగుతున్న పోరును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: